Don't Miss!
- Finance
ధనిక దేశంలో ఇంధన సంక్షోభం.. గ్యాస్ బిల్లులు చెల్లించేందుకూ అవస్థలు
- News
చైనాకు అమెరికా భారీ షాక్ - కూల్చివేత..!!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Salaar ప్రభాస్ మూవీలో యష్ స్పెషల్ అప్పీయిరెన్స్.. సలార్‌లో మ్యాజిక్ చేయబోతున్న ప్రశాంత్ నీల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్‌తో పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో సలార్ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొంటున్నది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ లాంటి బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కుతున్నదనే అనుమానం అభిమానుల్లో నెలకొన్నాయి. మైనింగ్ నేపథ్యంగానే ఈ సినిమా తెరకెక్కుతుందనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వినిపిస్తున్నది. ఈ చిత్రంలో కేజీఎఫ్‌లో రాకీభాయ్‌గా ఇండియా వైడ్‌గా అభిమానులను సంపాదించుకొన్న యష్ నటిస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త వివరాల్లోకి వెళితే..
కేజీఎఫ్2 చిత్రంలో అధీరాను ఎదురిస్తూ ఓ యువకుడు మరణిస్తాడు. అయితే ఆ యువకుడి మృతదేహాన్ని రాకీ భాయ్ తీసుకొస్తాడు. అయితే ఆ బాడీపై గుడ్డ కప్పి ఉంటుంది. ఆ యువకుడు సలార్‌లో ప్రభాస్ అనే వార్త వైరల్ అవుతున్నది. సలార్ కథకు కేజీఎఫ్ కథ లీడ్ ఉంటుంది.. కేజీఎఫ్ చిత్రంలో యష్ ధరించిన ఓ తాయత్తు కూడా ప్రభాస్ మెడలో ఉండటం కూడా ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్‌లో కనిపించింది. అంతేకాకుండా సలార్‌లో ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ భాయ్ నటించడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది.

కథ డిమాండ్ చేయడం వల్ల ప్రభాస్ సలార్‌లో యష్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసే యూనివర్స్‌లో యష్ ఉండబోతున్నాడనే విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఇలాంటి వార్తలు ఊహాగానాలేనా? నిజమేనా అనేది కొద్ది రోజుల్లో తేలిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
సలార్ సినిమా విషయానికి వస్తే.. శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు..జగపతి బాబు, శ్రీయారెడ్డి, మధు గురుస్వామి నటిస్తున్నారు. విజయ్ కిరంగదూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్‌గా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2023, సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.