క్రికెటర్ కేఎల్ రాహుల్‌‌తో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. మ్యారేజ్ డేట్‌ ఎప్పుడంటే?

క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ హీరోయిన్ అతియాశెట్టి పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాలో మరోసారి గుప్పుమన్నాయి. గత కొద్దికాలంగా ఈ ఇద్దరు సెలబ్రిటీల వివాహం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాహుల్‌తో పెళ్లి గురించి అతియా తండ్రి, నటుడు సునీల్ శెట్టి స్పందించారు. అయితే అతియా, రాహుల్ పెళ్లి ఎప్పుడు జరగబోతుందనే విషయంపై వారు ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే..

మీడియాలో రాహుల్, అతియా అఫైర్ గురించి

మీడియాలో రాహుల్, అతియా అఫైర్ గురించి


క్రికెటర్ కేఎల్ రాహుల్‌తో అతియా డేటింగ్ వ్యవహారం ముంబై మీడియాకు హాట్ టాపిక్‌గా మారింది. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి బాలీవుడ్ పత్రికలు గోరంతలు కొండతలు చేసి రాశాయి. అయితే ఈ వార్తలకు తెర దించుతూ అతియా పుట్టిన రోజును పురస్కరించుకొని కేఎల్ రాహుల్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో వారిద్దరి ప్రేమ వ్యవహారం బట్టబయలు అయింది.

 తడప్ మూవీ ప్రీమియర్ సందర్భంగా

తడప్ మూవీ ప్రీమియర్ సందర్భంగా


ఇక అతియాశెట్టి సోదరుడు ఆహాన్ శెట్టి తొలి చిత్రం తడప్ రిలీజ్ సందర్భంగా శెట్టి ఫ్యామిలీతో కలిసి కేఎల్ రాహుల్ రావడం మరింత క్లారిటీ ఇచ్చారు. రాహుల్ ప్రేమకు అతియా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉందనే విషయం ఆ సందర్భంగా స్పష్టమైంది. తడప్ మూవీ ప్రీమియర్ సందర్భంగా అతియా, కేఎల్ రాహుల్ సన్నిహితంగా ఉండటాన్ని మీడియా హైలెట్ చేసింది.

మరో మూడు నెల్లలో పెళ్లి అంటూ

మరో మూడు నెల్లలో పెళ్లి అంటూ


అతియా, కేఎల్ రాహుల్ అఫైర్ గురించి అనేక వార్తల నేపథ్యంలో మరోసారి వారిద్దరి పెళ్లి చర్చనీయాంశమైంది. మరో మూడు నెలల్లో అతియా, రాహుల్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ముంబై మీడియాలో బాంబులా పేలింది. అంతేకాకుండా పెళ్లి ఏర్పాట్లు కూడా జోరందుకొన్నాయనే వార్త వారి పెళ్లికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇక కేఎల్ రాహుల్, అతియా ఫ్యామిలీ మధ్య ఇటీవల చర్చలు కూడా జరిగాయి. బాలీవుడ్ పత్రికలు కథనాన్ని వెల్లడించాయి.

రెండు ఫ్యామిలీల కలయికతో జోరుగా

రెండు ఫ్యామిలీల కలయికతో జోరుగా


బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. ఇటీవల రాహుల్ తల్లిదండ్రులు అతియా ఫ్యామిలీని ముంబైలో కలిశారు. రాహుల్, అతియా తమ పెళ్లి తర్వాత నివసించేందుకు కొత్తగా కడుతున్న ఇంటిని సందర్శించారు. ఇంటి వాస్తును, ఇతర అంశాలను ఇరు సెలబ్రిటీల తల్లిదండ్రులు పరిశీలించారు. మరో మూడు నెలల్లో ముంబైలో వీరిద్దరి పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించారు అని పేర్కొన్నారు.

నా కూతురు పెళ్లి జరగడం ఖాయం అంటూ సునీల్ శెట్టి

నా కూతురు పెళ్లి జరగడం ఖాయం అంటూ సునీల్ శెట్టి


డిసెంబర్ 2022లో కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి జరుగుతుందా అనే ప్రశ్నకు నటుడు సునీల్ శెట్టి సమాధానం ఇస్తూ.. ఆమె నా కూతురు. ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోవాల్సిదే. నా కొడుకు పెళ్లి కూడా మంచి రోజు చూసి చేయాలనుకొంటున్నాను. అయితే ఎప్పుడు అనేది వారి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. కేఎల్ రాహుల్ విషయానికి వస్తే.. మంచి యువకుడు. అతనంటే నాకు ఇష్టమే. అయితే కాలం మారింది. వారి జీవితాలకు సంబంధించి వారే నిర్ణయం తీసుకోవాలన్నది నా అభిప్రాయం. కొడుకైనా, కూతురైనా వారి జీవితాలకు వారే బాధ్యులు. కాబట్టి వారి పెళ్లి బాధ్యత వారిపై పెట్టాం. మేము ఆశీర్వదించడమే మా పని అని సునీల్ శెట్టి వేదాంతం మాట్లాడారు.

కేఎల్ రాహుల్, అతియా శెట్టి కెరీర్ ఇలా

కేఎల్ రాహుల్, అతియా శెట్టి కెరీర్ ఇలా


ఇక కేఎల్ రాహుల్, అతియాశెట్టి కెరీర్ విషయానికి వస్తే.. గాయం కారణంగా రాహుల్ సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. తన గాయానికి సర్జరీ జరిగిన తర్వాత రెండు వారాలు చాలా కష్టంగా గడిచాయి అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం సర్జరీ తర్వాత ఆయన వేగంగా కోలుకొంటున్నారు. ఇక అతియాశెట్టి మోతీచూర్, చక్నాచూర్ అనే సినిమాలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X