»   » నెక్స్ట్ ఎన్టీఆర్ నే టార్గెట్ చేసాడు...ప్రస్తుతం టాక్స్

నెక్స్ట్ ఎన్టీఆర్ నే టార్గెట్ చేసాడు...ప్రస్తుతం టాక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ రివేంజ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైపోయింది. ఈ నేపధ్యంలో తన తదుపరి చిత్రంపై ఎన్టీఆర్ పూర్తి దృష్టి పెట్టారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అందుతున్న సమాచారం ప్రకారం...ఎన్టీఆర్...తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు గత కొద్ది రోజులగా టాక్స్ జరుగుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంతది. ప్రస్తుతం మహేష్ తో ప్లాన్ చేసిన చిత్రం పూర్తైన వెంటనే ఈ చిత్రం తెరకెక్కనుంది. మహేష్ తో శ్రీమంతుడు చిత్రం నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ వారే ఈ చిత్రాన్ని నిర్మించే అవకాసం ఉంది.

వాస్తవానికి మిర్చి హిట్టైన వెంటనే నెక్ట్స్ ప్రాజెక్టు ఎన్టీఆర్ తో అనుకున్నారు. అయితే ప్రాజెక్టు డిలే కావటంతో ఈక్వేషన్స్ మారి మహేష్ బాబు సీన్ లోకి వచ్చారు. దాంతో శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ తో చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చారు. దాంతో ఇప్పుడు ఆ మేరకు శివతో చర్చలు జరుపుతున్నారు. అయితే కొరటాల శివ తో చేసేది కత్తి రీమేకా లేక వేరే కధా అనేది తేలాల్సి ఉంది.

Is Koratala Siva the Director for Jr NTR's 26th?

ఇక సుకుమార్, ఎన్టీఆర్ చిత్రం విశేషాల్లోకి వెళితే...

మే 14,15 లలో ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ లండన్ లో మొదలు కానుంది. అలాగే ఈ టైటిల్ మార్చే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. న్యూమరాలిజీ ప్రకారం...నా అక్షరంతో ప్రారంభమైన నా అల్లుడు, నాగ చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో ..మొదట నా వద్దని సెంటిమెంట్ గా అది వర్కవుట్ కాదని ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. దాంతో ‘మా నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ పెట్టే అవకాసం ఉందని తెలుస్తోంది.

తారక్‌... కొత్త కోణం

తొలి అడుగుల్లోనే ఆకాశమే హద్దుగా ఇమేజ్‌ని సంపాదించుకొన్న హీరో ... ఎన్టీఆర్‌. ఆయన తెరపై తొడగొట్టాడు. మీసాలు మెలేశాడు. అభిమానులకు కావాల్సింది అదే కదా! అందుకే అనతికాలంలోనే మాస్‌ హీరో అనిపించుకొన్నాడు. అయితే మాస్‌ కథల్లో తప్ప ఆయన్ని ఇతరత్రా చిత్రాల్లో చూడలేమేమో అన్న విమర్శలు కూడా వచ్చాయి. వెంటనే నటుడిగా తనని తాను నిరూపించుకొనే ప్రయత్నం చేశారు తారక్‌.

Is Koratala Siva the Director for Jr NTR's 26th?

సోషియో ఫాంటసీ మొదలుకొని సెంటిమెంట్‌ వరకు రకరకాల కథల్లో నటించి మెప్పించారు. ఇటీవల 'టెంపర్‌'తో తనలోని స్త్టెల్‌ కూడా చూపించాడు. ఆ చిత్రం అందించిన విజయంతో మరింత ఉత్సాహంగా ఉన్న ఉన్న ఎన్టీఆర్‌ ఇప్పుడు సుకుమార్‌ చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నాడు. 'నాన్నకు ప్రేమతో' అనే పేరు ప్రచారంలో ఉంది. దీంతోపాటు తారక్‌కోసం మరిన్ని కథలు సిద్ధమవుతున్నాయి.

తన చిత్రాల్లో హీరోలని సరికొత్తగా చూపిస్తుంటారు సుకుమార్‌. ఇప్పుడు ఎన్టీఆర్‌ని కూడా తెరపై ఓ కొత్త పాత్రలో చూపించేందుకు ఆయన నడుం బిగించారు. అందుకోసం తారక్‌ స్త్టెల్‌ని కూడా పూర్తిగా మార్చేస్తున్నాడు. 'టెంపర్‌'లో కొత్త ఎన్టీఆర్‌ని చూసిన అభిమానులు సుక్కు చిత్రంపై మరిన్ని అంచనాలు పెంచుకొంటున్నారు. నాన్న ఆశయాన్ని నెరవేర్చే కొడుకు కథగా ప్రచారంలో ఉన్నప్పటికీ సుకుమార్‌ ఈ చిత్రాన్ని కొత్త తరహాలో తీర్చిదిద్దుతున్నట్టు సమాచారం. కథతో పాటు, కథనం కూడా వైవిధ్యంగా ఉంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇందులో తారక్‌ సరసన రకుల్‌ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది.

మరో ప్రక్క కథలు సిద్ధం..

'టెంపర్‌'తో ఫామ్‌లోకొచ్చిన ఎన్టీఆర్‌ కోసం పరిశ్రమలో బోలెడన్ని కథలు సిద్ధమవుతున్నాయి. స్టార్‌ దర్శకులు మొదలుకొని... కొత్తగా మెగాఫోన్‌ పట్టేందుకు సిద్ధమవుతున్న యంగ్‌ కెప్టెన్ల వరకు అందరూ ఎన్టీఆర్‌ని దృష్టిలో పెట్టుకొని కథలు సిద్ధం చేసుకొంటున్నారు. ఎన్టీఆర్‌తో 'అదుర్స్‌2' చిత్రాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు వీవీ వినాయక్‌. హరీష్‌శంకర్‌ కూడా ఎలాగైనా ఎన్టీఆర్‌తో హిట్టు కొట్టాల్సిందే అంటున్నాడు.

మరోపక్క రచయిత వక్కంతం వంశీ ఎన్టీఆర్‌ కోసం ఎప్పుడో కథలు సిద్ధం చేసి పెట్టుకొన్నారు. వీటితో పాటు తమిళ చిత్రం 'కత్తి'ని కూడా ఎన్టీఆర్‌పై రీమేక్‌ చేయాలనే సన్నాహాలు జరుగుతున్నాయి. చూస్తుంటే ఎన్టీఆర్‌ రానున్న రోజుల్లో మరింత బిజీగా గడిపే అవకాశాలున్నాయి.

English summary
NTR is holding talks with Koratala Siva and a project in their combination will go on floors after Sukumar's project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu