»   » నాగార్జున వెనుకడుగు వేస్తున్నాడా?

నాగార్జున వెనుకడుగు వేస్తున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాగార్జున పోటీ ఎందుకులే అని వెనకడగు వేస్తున్నాడా..ఇప్పుడు ఇదే ఉత్కంఠ ట్రేడ్ వర్గాల్లో అభిమానుల్లో ఉంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ...వినోదం, కుటుంబ అనుబంధాల సమాహారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా' . ప్రస్తుతం ఈ సినిమా వెనకడుగు వెయాలని చూస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే అఫీషియల్ గా ఏ సమాచారం లేదు.

ఈ సంక్రాంతికి పోటీ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం అని చెప్తున్నారు. మెన్నటి వరకు కేవలం బాలకృష్ణ, ఎన్టీఆర్ ఈ ఇద్దరితోనే పోటీ వుండటంతో ధైర్యంగా ముందడురు వేసారు నాగ్, కాగా ఇప్పుడు శర్వానంద్ కూడా రంగంలోకిదిగటంతో ఆలోచనలో పడ్డాడు నాగ్ అని తెలుస్తోంది. ముఖ్యంగా థియోటర్స్ సమస్య వస్తుందని, సరైన థియోటర్స్ పట్టుకోవటం కష్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమ సినిమా ఫెరఫెక్ట్ టైమింగ్ మాత్రం సంక్రాంతికే అని మాత్రం ఆయన అంటున్నారట.


Is Nagarjuna one step backword?

సోగ్గాడే చిన్ని నాయినా విషయానికి వస్తే...రమ్యకృష్ణ, లావణ్యత్రిపాఠి హీరోయిన్స్. వినూత్న కథాంశంతో గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తున్నారు. రెండు పాత్రలు సరికొత్త పంథాలో సాగుతాయని చిత్ర యూనిట్ చెబుతోంది.


ఇక మనం చిత్రంతో కథల ఎంపికలో తన పంథాను నాగార్జున మార్చుకున్న సంగతి తెలిసిందే. వైవిధ్యంతో కూడిన కథాంశాలకే ప్రాధాన్యతనివ్వాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా.. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా కల్యాణ్‌కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత.


లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం స్వామిజీగా వినోదం పండిస్తారని సమాచారం. హంసానందిని, అనసూయ , చలపతిరావు, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా' నిర్మాత రామ్మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.

English summary
As per the sources Nagarjuna is contemplating of postponing Soggade Chinnni Nayana as there would be shortage of theaters for shankranthi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu