For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ కి లవ్ స్టోరీలో ఆమే పుల్లలు పెడుతోంది

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్ కు లేడీ విలన్ ఉండనుందా..అంటే అవుననే అంటున్నాయి తెలుగు సినీ వర్గాలు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రంలో నిత్యామీనన్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తోందని సమాచారం. ఉపేంద్ర సోదరిగా ఆమె కనిపించనుందని సమాచారం. అల్లు అర్జున్ ని వన్ సైడ్ ప్రేమించి భంగపడిన పాత్ర అని చెప్తున్నారు. ఆమె అల్లు అర్జున్ ప్రేమ ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు. ఆ పాత్రకు మొదట ప్రణీతను అనుకున్నారు కానీ నిత్యా అయితే తన నటనతో నిలబెడుతుందని తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే అది ఎంతవరకూ నిజమే చూడాలి.

  చిత్రం మరిన్ని వివారాల్లోకి వెళ్తే...

  'జులాయి' లాంటి ఘన విజయం సాధించిన చిత్రం తర్వాత అల్లు అర్జున్, డైనమిక్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ కాంబినేషన్లో ఓ సినిమా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి 'త్రిశూలం' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ తో 1982 లో కృష్ణరాజు హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిత్రం రూపొందింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కథకు ఈ టైటిల్ అయితే కరెక్టుగా సూట్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ టైటిల్ ఫైనల్ చేస్తారా లేదా మరో టైటిల్ అనుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అప్పటివరకూ ఇది రూమర్ క్రిందే లెక్క.

  హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంతా, ఆదాశర్మ, రాశిఖన్నా హీరోయిన్స్ . ఏప్రిల్‌లో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. జులాయి తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

  Is Nithya Menen a Villain in Allu Arjun’s Film

  కొత్త కథ, కథనాలతో ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని నిర్మాత చెబుతున్నారు. ఈ చిత్రంలో స్నేహ, కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు.

  త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఆయన చేస్తున్న తాజా చిత్రం షూటింగ్ కోసం ఆయన అక్కడకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కంటిన్యూగా ఓ పెద్ద షెడ్యూల్ చేయనున్నారు. సమంత, అదా శర్మ, ఉపేంద్ర ఆ షెడ్యూల్ లో పాల్గొననున్నారు.

  ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ చిత్రం కీ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో ఉపేంద్ర నెగిటివ్ పాత్ర చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పాత్ర నెగిటివ్ కాదని..ప్యారలల్ గా సాగే పాత్ర అని సినిమాలో మరో లీడ్ క్యారెక్టర్ లాంటిదని తెలుస్తోంది. అందుకే ఉపేంద్ర ఒప్పుకున్నాడని తెలుస్తోంది.

  త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ మరోసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది. చాలా కాలం నుంచి రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కావటంతో అభిమానుల ఆనందానికి అంతేలేదు.

  ఇదివరకు 'జులాయి'తో సందడి చేసిన ఈ కలయికపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త సినిమాకు చాలా రోజుల క్రితమే కొబ్బరికాయ కొట్టేశారు. వచ్చే నెలలో చిత్రీకరణ అన్నారు. అయితే రకరకాల కారణాలతో వాయిదాపడుతూ వచ్చింది. ఈ లోగా అల్లు అర్జున్ షార్ట్ ఫిలిం, యాడ్స్ అంటూ బిజీ అయ్యారు. ఈలోగా త్రివిక్రమ్ చిత్రం స్క్రిప్టుకు పూర్తి స్ధాయిలో మెరుగులు దిద్దారు.

  ప్రస్తుతం ఉపేంద్ర చేస్తున్న పాత్రకు గానూ...జగపతిబాబు, అర్జున్‌ పేర్లనూ పరిశీలించారు. చివరికి ఉపేంద్రను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇందులో బన్నీ సరసన సమంతతో పాటు ప్రణీత, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తారని సమాచారం. స్నేహ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తారు.

  English summary
  Trivikram has recently brought Nitya Menen into this film as a sister of Upendra with negative character.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X