»   »  ఎన్టీఆర్ గ్యారేజీలో హీరోయిన్స్ వీళ్లా?

ఎన్టీఆర్ గ్యారేజీలో హీరోయిన్స్ వీళ్లా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాన్నకు ప్రేమతో చిత్రం షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరు అందుకున్నారు. మరో ప్రక్క దర్శక, నిర్మాతలు ఈ చిత్రానికి హీరోయిన్స్ ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ‘జనతా గ్యారేజీ' అనే వర్కింగ్ టైటిల్ రూపొందనున్న ఈ చిత్రంలో సమంతను ఇప్పటికే ఎంపిక చేసినట్లు సమాచారం.

అలాగే మరో హీరోయిన్ గా నిత్యామీనన్ ని ఎంపిక చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నిత్యామీనన్ ని కలిసి కథ చెప్పారని, ఆమె కూడా డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని ఎన్టీఆర్ తో చేయటానికి ఆసక్తి చూపించిందని సమాచారం.

Is Nitya Menon Finalised For NTR?

మహేష్ తో ‘శ్రీమంతుడు' చిత్రాన్ని తెరకెక్కించిన మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇందుకోసం ఆయన తెలుగు సైతం నేర్చుకుంటున్నారు.

ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ పనుల తో పాటు స్క్రిప్ట్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. జనవరి చివర్లో కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

English summary
According to reports Ntr's Janatha Garage makers have approached Nitya Menan for second heroine role.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu