»   » ‘ఊపిరి’ దర్శక నిర్మాతలు అతన్ని మోసం చేసారా?

‘ఊపిరి’ దర్శక నిర్మాతలు అతన్ని మోసం చేసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున-కార్తి ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సినిమాస్ వారు తెరకెక్కించిన 'ఊపిరి' సినిమా గురించి ఓ గాసిప్ ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశం అయింది. ఊపిరి దర్శక నిర్మాతలు ఓ నటుడిని మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

తెలుగు సీనియర్ నటుల్లో ఒకరైన రాజారవీంద్ర అందరికీ సుపరిచితమే. రాజా రవీంద్ర 'ఊపిరి' టైటిల్‌ను ఎప్పుడో రిజిస్టర్‌ చేసి పెట్టుకున్నాడు. 'ఊపిరి' టైటిల్‌ తమకు ఇచ్చినట్టయితే సినిమాలో ఓ మంచి పాత్ర ఇస్తామని అతగాడికి ఆశ పెట్టినట్లు సమాచారం.


నాగార్జున లాంటి పెద్ద హీరో సినిమా కావడంతో 'ఊపిరి' సినిమా టైటిల్ వారికి ఎలాంటి డబ్బు తీసుకోకుండా వారికి ఇచ్చేసాడు. వారు చెప్పినట్లే రాజారవీంద్రకి సినిమాలో ఓ పాత్ర ఇచ్చారు. అదీ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర. సినిమాలో ఆయన కనిపించేది ఒక్క నిమిషం కూడా ఉండదు, ఆయన పాత్రకు ఉన్న డైలాగ్ కూడా ఒకే ఒక్కటి.


Is Oopiri Team Cheated Raja Ravindra?

దీంతో రాజారవీంద్ర తన సన్నిహితుల వద్ద ఈ విషయమై చాలా బాధపుతున్నట్లు సమాచారం. ఒకరకంగా తాను మోస పోయానని, తనకు సినిమాలో మంచి పాత్ర వస్తుందని ఆశించాను. కానీ అలా జరుగలేదు అంటూ బాధ పడుతున్నాడట.


'ఊపిరి' సినిమా విషయానికొస్తే.... విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెలుతోంది. ఈ చిత్రం ఆల్రెడీ ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ మార్కును అందుకుంది.

English summary
The makers of Oopiri are currently enjoying the success of the film. Actually "Oopiri" title is registered by Raja Ravindra and given to Vamsi Paidipally upon request.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu