వకీల్ సాబ్‌లో అఖిరా నందన్ స్పెషల్ ఎంట్రీ.. సెకండాఫ్‌లో సర్‌ప్రైజ్ అదే అంటూ లీక్..

వకీల్ సాబ్ చిత్రం రిలీజ్‌కు ముందే ఎన్నో విశేషాలకు, రికార్డులకు, ఆసక్తికరమైన విషయాలకు వేదికగా నిలుస్తున్నది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఈ చిత్రంపై గతంలో ఎన్నడూ లేని విధంగా అంచనాలు నెలకొన్నాయి. పింక్ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాలో అభిమానులను ఆకట్టుకొనే చాలా విషయాలను కథలో జొప్పించినట్టు దర్శకుడు శ్రీరాం వేణు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

పలు మార్పులతో వకీల్‌సాబ్‌గా

పలు మార్పులతో వకీల్‌సాబ్‌గా


ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు, భాషల ప్రేక్షకులను ఆకట్టుకొన్నది. తమిళంలో రూపొందించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ప్రస్తుతం తెలుగులో వకీల్ సాబ్‌గా అనేక మార్పులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

సెకండాఫ్‌లో సర్‌ప్రైజ్ అంటూ

సెకండాఫ్‌లో సర్‌ప్రైజ్ అంటూ

అయితే దర్శకుడు శ్రీరాం వేణు పలు సందర్భాల్లో వకీల్ సాబ్ సినిమాలో చేసిన మార్పుల గురించి చెప్పి చెప్పనట్లే వ్యవహరించారు. ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో ఓ ట్విస్టు, సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పారు. ఆ సర్‌ప్రైజ్ గురించి చెప్పడానికి నిరాకరించారు. కొన్ని సందర్బాల్లో చెప్పడానికి ముందుకు వచ్చి దానిని గుట్టుగానే ఉంచారు. వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెబుతానని ప్రామిస్ చేశారు.

రివీల్ చేస్తే పెద్దగా ఊహించుకొంటారని..

రివీల్ చేస్తే పెద్దగా ఊహించుకొంటారని..


ఇదిలా ఉండగా, వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున సెకండాఫ్‌లో ఉన్న సర్‌ప్రైజ్ ఏమిటో చెప్పమని దర్శకుడు శ్రీరాం వేణును యాంకర్ సుమ ఒత్తిడి చేసింది. అయితే వేదికపై నుంచి సెకండాఫ్‌లో ఉన్న ఎలిమెంట్ ఏమిటంటే.. అంటూ కొంత సంశయానికి గురయ్యారు. నేను రివీల్ చేస్తే మీరు చాలా పెద్దగా ఊహించుకొంటారు. అందుకే వెండితెరపైనే చూడండి అంటూ శ్రీరాం వేణు సస్సెన్స్‌ను కొనసాగించారు.

సెకండాఫ్‌లో అఖిరా నందన్

సెకండాఫ్‌లో అఖిరా నందన్

అయితే తాజా సమాచారం ప్రకారమే కాకుండా మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ప్రకారం.. సెకండాఫ్‌లో పవన్ కల్యాణ్ కుమారుడు అఖిరా నందన్ ఓ స్పెషల్ పాత్రలో కనిపిస్తారు. అదే ఈ సినిమాకు సర్‌ప్రైజ్ అంటూ ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. అదే నిజమైతే పవర్‌స్టార్ అభిమానులకు డబుల్ ధమాకే అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Recommended Video

Pawan Kalyan Reaction After Watching Vakeel Saab
టాలీవుడ్ ఎంట్రీకి అఖిరా నందన్ సిద్ధం

టాలీవుడ్ ఎంట్రీకి అఖిరా నందన్ సిద్ధం


కొద్దికాలంగా పవన్ కల్యాణ్ కుమారుడు అఖిరా నందన్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాంచరణ్ నిర్మాతగా వ్యవహరించే చిత్రం ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో వకీల్‌సాబ్‌లో అఖిరా నందన్ కనిపించి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తారా లేదా అనేది కొద్ది గంటలు ఆగితే స్పష్టమవుతుంది. అఖిరా నందన్ స్పెషల్ ఎంట్రీ వార్త నిజమా? గాసిప్ అనేది తేలిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X