Don't Miss!
- News
వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం: దట్టమైన పొగతో జనాలు ఉక్కిరిబిక్కిరి
- Sports
అదే మా కొంపముంచింది: మిచెల్ సాంట్నర్
- Lifestyle
ప్రతి దాంట్లోనూ ఎల్లప్పుడూ విజయం సాధించే రాశుల వారు వీరు... ఇందులో మీ రాశి ఉందా?
- Finance
adani bonds: అదానీ కంపెనీలకు ఎదురుదెబ్బ.. ఝలక్ ఇచ్చిన క్రెడిట్ సుస్సీ
- Technology
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pooja Hegde సల్మాన్ ఖాన్‌తో పీకల్లోతు అఫైర్‌లో బుట్టబొమ్మ?.. వాస్తవాలను బయటపెట్టిన సినిమా క్రిటిక్!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అఫైర్ వార్తలు ఎప్పుడూ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడం కొత్తేమీ కాదు. గత రెండు దశాబ్దాలుగా సల్మాన్ ప్రేమ పురాణాలు జాతీయ, బాలీవుడ్ మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించడం తెలిసిందే. అయితే ఇప్పటికే పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో సల్మాన్ అఫైర్ గురించి కథలు, కథలుగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుగు వారికి సుపరిచితమైన బుట్టబొమ్మ పూజా హెగ్డేతో సల్మాన్ ప్రేమ వ్యవహారం బాలీవుడ్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

సల్మాన్ ఖాన్ తొలి అఫైర్
బాలీవుడ్‌లో అడుగుపెట్టక ముందు నుంచే సల్మాన్ ఖాన్ అప్పటి యంగ్ హీరోయిన్, క్రికెటర్ అజారుద్దీన్ మాజీ భార్య సంగీత బిజ్లానీతో పీకల్లోత ప్రేమలో మునిగిపోయారు. అయితే దాదాపు పెళ్లి వరకు వచ్చిన ఈ ఇద్దరి ప్రేమాయణం అభిప్రాయబేధాల కారణంగా బ్రేకప్ అయింది. ఆ తర్వాత వెంటనే బాలీవుడ్‌లో కొంతకాలం మెరిసి.. కనుమరుగైన సోమీ ఆలీతో కొద్ది రోజులు సాగింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో సోమీ ఆలీ బాలీవుడ్‌ను వదిలేసి అమెరికాకు వెళ్లిపోవడంతో రెండో అఫైర్‌కు శుభం కార్డు పడింది.

ఐశ్వర్య రాయ్‌తో సల్మాన్ ఖాన్
ఆ తర్వాత ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌తో సల్మాన్ ఖాన్ అఫైర్ మరో హాట్ టాపిక్. ఐశ్వర్యను పిచ్చిగా ప్రేమించిన సల్మాన్.. దాదాపు పెళ్లి కూడా చేసుకోవాలనుకొన్నారు. అయితే ఆ సమయంలో సల్మాన్ తాగి.. ఆమెను దారుణంగా కొట్టడం చేయడం మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే సల్మాన్ ప్రవర్తననతో విసిగిపోయిన ఐశ్వర్య.. ఆయనకు గుడ్ బై చెప్పి.. వివేక్ ఒబెరాయ్‌తో అఫైర్ పెట్టుకొన్నది.

కత్రినా కైఫ్‌తో పీకల్లోతు ప్రేమలో
ఇక ఐశ్వర్య రాయ్ తర్వాత సల్మాన్ ఖాన్ అఫైర్ కత్రినా కైఫ్‌తో జోరుగా సాగింది. ఇక ఈసారి కత్రినా, సల్మాన్ పెళ్లి కావడం గ్యారెంటీ అని అందరూ అనుకొన్నారు. అయితే అందరూ ఊహించినట్టు కాకుండా సల్మాన్‌ను విడిచేసి.. కత్రినా రణ్‌బీర్ కపూర్‌కు దగ్గరైంది. ఆ తర్వాత ఇలియా వాంటర్‌తో సల్మాన్ పెళ్లి అంటూ వార్తలు వచ్చినా.. అవి కార్యరూపం దాల్చలేదు. ఇక ఇటీవల కాలంలో జాక్వలైన్ ఫెర్నాండేజ్‌తో డేటింగ్ వార్తలు వచ్చాయి. కానీ అది ఎక్కువ కాలం కొనసాగలేదు.

సల్మాన్ ఖాన్ కొత్త ప్రేయసి పూజా హెగ్డే
అయితే ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కొత్త ప్రేయసి పూజా హెగ్డే అంటూ కొత్త వార్త ముంబై మీడియాను హల్‌చల్ చేస్తున్నది. పూజా, సల్మాన్ మధ్య రిలేషన్‌షిప్ కొనసాగుతుందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్నది. వారిద్దరూ గంటలు, గంటలుగా కలిసి క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఇద్దరి అఫైర్ గురించి సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది.

సల్మాన్ ఖాన్ బ్యానర్‌లో రెండు సినిమాలు
పూజా హెగ్డే, సల్మాన్ ఖాన్ రిలేషన్‌షిప్ వార్తలు మీడియాలో వైరల్ అవుతున్న సమయంలో దుబాయ్‌కి చెందిన సినీ క్రిటిక్ ఉమేర్ సంధూ సోషల్ మీడియాలో బాంబు పేల్చాడు. ముంబై నగరంలో కొత్త జంట. పూజా హెగ్డే ప్రేమలో సల్మాన్ ఖాన్ పడిపోయాడు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ వరుసగా మరో రెండు సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు ఇచ్చారు. సల్మాన్ ఖాన్ బ్యానర్‌లో రెండు సినిమాలు చేయడానికి పూజా హెగ్డే పచ్చ జెండా ఊపింది. సల్మాన్ ఖాన్ సన్నిహితులు కూడా వారి అఫైర్‌ను ధృవీకరించారు అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు.

పూజా హెగ్డే సినిమా కెరీర్ ఇలా..
పూజా హెగ్డే సినిమా కెరీర్ విషయానికి వస్తే. గతేడాది తెలుగు, తమిళంలో కలిపి బ్యాక్ టు బ్యాక్ నాలుగు సినిమాలు చేసింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్3 చిత్రాలతో ఆలరించింది. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఆమె నటించిన సర్కస్ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. అలాగే సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసి కా భాయ్.. కిసి కి జాన్ అనే చిత్రంలో నటిస్తున్నది. అలాగే మహేష్ బాబుతో కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో నటిస్తున్నది.