»   » రాజ్ తరుణ్ అన్ని తప్పులు చేశాడా?.. దాని ఫలితమే..

రాజ్ తరుణ్ అన్ని తప్పులు చేశాడా?.. దాని ఫలితమే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో అవకాశాలను అందిపుచ్చుకొంటేనే అగ్రస్థానం దక్కుతుందనే విషయం అందరికి తెలిసిందే. 'ఉయ్యాలా జంపాలా', 'సినిమా చూపిస్త మావా', 'కుమారి 21ఎఫ్‌' లాంటి విజయాలతో టాలీవుడ్ లో ఓ రేంజ్ కు చేరుకొన్న ఈ యువ హీరో వేసిన తప్పటడుల వల్లే విజయాలు దూరమయ్యాయనే టాక్ వినిపిస్తున్నది. రాజ్ తరుణ్ జడ్జిమెంట్ సరిగా లేకపోవడంతో 'ఆడోరకం ఈడోరకం'లాంటి చిత్రాల్లో నటిస్తున్నాడనే రూమర్ ప్రచారం జరుగుతున్నది.

 Raj Tharun

ఇటీవల రాజ్ తరుణ్ వదులుకొన్న చిత్రాలు టాలీవుడ్ ఘన విజయాలు సాధించడమే కాకుండా భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. ఈ మధ్య రాజ్ తరుణ్ చేజార్చుకొన్న చిత్రాలు శతమానం భవిత, నేను లోకల్ చిత్రాలు కావడం గమనార్హం. తొలుత శతమానం భవతి కథను శర్వానంద్, సాయిధరమ్ తేజ్ కంటే ముందుగా రాజ్ తరుణ్ కే వినిపించారట. అయితే కథలో కొన్ని మార్పులు చేయాలని సూచించడంతో ఆ చిత్రం చేసే అవకాశం శర్వానంద్ కు చిక్కింది. శర్వానంద్ పేరును దిల్ రాజుకు సాయి ధరమ్ తేజ్ సూచించాడట.

ఇక నాని హీరోగా ఇటీవల విడుదలైన 'నేను లోకల్‌' కూడా రాజ్‌తరుణ్‌ చేయాల్సిందే. ఈ సినిమా ఈ చిత్రం టాలీవుడ్ లోనే కాకుండా అమెరికాలో భారీ వసూళ్లు సాధించింది. ఈ రెండు చిత్రాలు రాజ్‌తరుణ్‌ ఖాతాలో పడి ఉంటే.. అతని కెరీర్‌ ఎక్కడికో వెళ్లిపోయి ఉండేదని సినీ క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు.

English summary
There is rumour in tollywood that, Hero raj Tharun rejected Shatamanam Bhavati, nenu local. These two hits given huge hits to Sharwanand, Nani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu