»   » రాజమౌళి అంతగా సెంటిమెంట్ ఫీలయ్యే ఇవన్నీ

రాజమౌళి అంతగా సెంటిమెంట్ ఫీలయ్యే ఇవన్నీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాహుబలి విషయంలో రాజమౌళి చాలా సెంటిమెంటల్ గా మారుతున్నారా...అవుననే అంటున్నారు. ఆయన ఆడియో లాంచ్ డేట్ కాన్సిల్ కావటంతో ఆయన అప్ సెట్ అయ్యారని అంటున్నారు. ఈ విషయమై ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. తాము ఎనౌన్స్ చేసిన తేదీలు..బామరాంగ్ లా మారుతున్నాయని ఆయన ఫీలవతున్నాడని అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


మొదటి మే 15 న ఆడియో అనుకున్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవటంతో వాయిదా వేసి దాన్ని మే 31 కి పిక్స్ చేసారు. అయితే మే 31కు ...చివరి నిముషంలో హైదరాబాద్ పోలీస్ వారు ఫర్మిషన్ ఇవ్వకపోవటంతో మరోసారి వాయిదా వెయ్యాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అప్పటినుంచి రాజమౌళి తెలుగు ఆడియన్స్ ... డేట్ ఎనౌన్స్ చేయటం మానేసారు.


Is Rajamouli Is Too Sentimental

జూన్ 13న తిరుపతి లో ఆడియో ఫంక్షన్ పిక్స్ అయినా..రాజమౌళి... ఈ విషయమై ట్వీట్ కూడా చేయలేదు...అలాగే ఫేస్ బుక్ లో కూడా షేర్ చేయలేదు. ఆడియోకంపెనీవారే ప్రెస్ నోట్ విడుదల చేసి ఖరారుచేసారు. అయితే జూలై 10న హిందీ, తమిళ రిలీజ్ డేట్ అని చెప్పారు కానీ తెలుగు గురించి ఆయన మాట్లాడలేదు.


అంతేకాకుండా ఇప్పుడు ఎస్పీ యూనివర్సిటీ గ్రౌండ్ లో.. స్టేజి డెకరేషన్ ప్రారంబించే ముందు భూమిపూజ కూడా చేసారు. ఇవన్నీ చూస్తుంటే రాజమౌళి చాలా సెంటిమెంట్ గా ఫీలవుతున్నట్లు భావిస్తున్నామని ఫిల్మ్ నగర్ వర్గాలుకామెంట్ చేస్తున్నాయి.


ప్రస్తుతం యావత్ భారతదేశ సినీ పరిశ్రమ కళ్ళన్నీ బాహుబలి చిత్రం వైపే వున్నాయి. ఈ సినిమా దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి బాహుబలి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.


Is Rajamouli Is Too Sentimental

ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మహాభారతమే తనకు స్పూర్తినిచ్చిందని తెలిపాడు. ఇదేకాదు దాదాపు తన సినిమాలన్నిటికీ రామాయణ, మహాభారతాలే స్పూర్తని చెప్పుకొచ్చాడు. ఈ రెండు ఇతిహాసాలతో తనకున్న అనుబంధమే దీనికి కారణమని తెలియజేసాడు. బాహుబలి పార్ట్ 1 జులై 10న మనముందుకు రానుంది. బాలీవుడ్ లో కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తుంది.


భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 'బాహుబలి - ది బిగినింగ్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా ఇతర ముఖ్య పాత్రధారులు. ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకుడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంతర్జాలంలో మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10న విడుదల చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.

English summary
Upset about audio launch planned on May 31st getting cancelled, Rajamouli is said to be soaking in sentiments at the moment.
Please Wait while comments are loading...