twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రచ్చ’లో రామ్ చరణ్ డైలాగ్ బాలయ్యకు కౌంటరా?

    By Bojja Kumar
    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజాగా సినిమా 'రచ్చ'లో వినిపిస్తున్న డైలాగ్ ఒకటి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఆ డైలాగ్ నందమూరి నటసింహం బాలయ్యకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉందని అంటున్నారు. మరి ఈ డైలాగ్ కావాలని పెట్టారా? లేక కాకతాళీయంగా అలా కుదిరిందో? తెలియదు కానీ ఈ విషయం హాట్ టాపిక్ అయింది.

    రచ్చ చిత్రంలోని...'చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు...ప్రజల అడుంటే చాలు'అంటూ చరణ్ చెప్పే డైలాగ్....... బాలకృష్ణ సింహా సినిమాలో చెప్పిన 'చరిత్ర సృష్టించాలన్నా మేమే....తిరగ రాయాలన్నా మేమే' అనే డైలాగ్‌కు కౌంటర్‌లా ఉందనీ అంటున్నారు.

    'అధినాయకుడు' చిత్రంలో చిరంజీవిపై సెటైర్లు ఉన్నాయని ఎలక్ట్రానికి మీడియాలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రచ్చలో బాలయ్యను టార్గెట్ చేస్తూ డైలాగ్ ఉండటంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అభిమానుల మధ్య జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో మళ్లీ ఏమైనా పునరావృతం అవుతాయేమోననే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

    సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న 'రచ్చ' చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్. మణిశర్మ సంగీతం అందించారు. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ బేనర్ పై ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్.బి.చౌదరి ఈ చిత్రానికి సమర్పకులు. ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్‌, ఛాయాగ్రహణం:సమీర్‌రెడ్డి, కూర్పు: గౌతంరాజు, కళ: ఆనంద్‌సాయి.

    English summary
    Is Ram Charan dialogue counter to Balaiah?...Mega fans claim that the dialogue “Charitra Rayadaniki Vayasu Tho Pani Ledu - Prajala Andunte Chaalu” is a retort to Balayya's powerful dialogue in 'Simha' which goes like “Charitra Srushtinchalanna Meme, Tiragarayalanna Meme”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X