»   »  రామ్ చరణ్-కొరటాల శివ చిత్రం లేనట్లేనా?

రామ్ చరణ్-కొరటాల శివ చిత్రం లేనట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రామ్ చరణ్,మిర్చి డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం ఆ మధ్యన ప్రారంభమైన సంగతి తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే రీసెంట్ గా ఈ చిత్రం ఆగిపోయిందంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే అది రూమరా..నిజమా అనేది తెలియదు.

ఆ రూమర్ ప్రకారం...రామ్ చరణ్ కి కొరటాల శివ చెప్పిన కథ నచ్చలేదని, అప్పటికీ రెండు మూడు లైన్స్ వినిపించినా చరణ్ పెద్దగా ఆసక్తి చూపలదేని చెప్పుకుంటున్నారు. బండ్ల గణేష్ తో సైతం చేయటానికి రామ్ చరణ్ ఇంట్రస్ట్ గా లేడని,అది కూడా ఓ కారణమని అంటున్నారు. అయితే ఇవన్నీ బేస్ లెస్ రూమర్స్ అని...మెగాభిమానులు కొట్టిపారేస్తున్నారు.

ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.... రామ్ చరణ్ కి చెప్పిన కథ ..పూర్తిగా బ్రదర్ సెంటిమెంట్ మీద బేస్ చేసుకుని నడుస్తుందని సమాచారం. సెంటిమెంట్,యాక్షన్ కలిసి ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. క్యాధరిన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే మరో హీరోయిన్ ఫైనల్ కానుంది.

బండ్ల గణేష్ మాట్లాడుతూ..రామ్ చరణ్ తో ఓ సెన్సేషనల్ మూవి తియ్యాలన్న నా కోరిక ఈ చిత్రంతో నెరవేరుతోంది. కొరటాల శివ అద్బుతమైన కథ చెప్పారు. హై టెక్నికల్ వేల్యూస్ తో నిర్మించే ఈ చిత్రం మా బేనర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుంది. జూలై లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఏకథాటిగా షూటింగ్ జరుపుతాము అన్నారు.

రామ్ చరణ్ తో పాటు మరో 50 మంది ప్రముఖ తారాగణం ముఖ్యపాత్రలు పోషించే ఈ చిత్రానికి సమర్ఫణ..శివబాబండ్ల, నిర్మాత బండ్ల గణేష్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం కొరటాల శివ. మిర్చి చిత్రంలో ప్రభాస్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన కొరటాల శివ....రామ్ చరణ్‌ను ఆయన గత సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ లుక్, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమా ఉండనుంది. రామ్ చరణ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంతో పాటు, బాలీవుడ్లో 'జంజీర్' చిత్రంలో నటిస్తున్నారు. జంజీర్ చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదల కానుంది.

English summary
There was also a rumor that a Koratala Shiva,Ram Charan film stopped. Ram Charan and ‘Mirchi’ director Koratala Shiva are teaming up for a new commercial entertainer. Apparently, the film has a very good dose of brother sentiment. The movie will have loads of action and high voltage entertainment. The film will be produced by Bandla Ganesh on Parameshwara Arts banner
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu