గుడ్‌న్యూస్ చెప్పిన మరో స్టార్ కపుల్? తండ్రి కాబోతున్న రానా దగ్గుబాటి?
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో స్టార్ కపుల్స్ అంతా వరుసగా గుడ్ న్యూస్ చెబుతున్నారు. ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంటకు పండంటి మగబిడ్డ పుట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ దంపతులు తాము త్వరలో తల్లిదండ్రులం కాబోతున్నట్లు తెలిపారు. అలాగే స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా - ఎంపీ రాఘవ్ చద్దా దంపతులకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఇక రెండ్రోజుల క్రితం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తాము రెండోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా అనౌన్స్ చేయడంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. ఈసారి చరణ్ దంపతులకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో టాలీవుడ్ స్టార్ కపుల్ చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
లీడర్‌తో ఎంట్రీ
దగ్గుబాటి వారసుడు, నిర్మాత సురేష్ బాబు కుమారుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు రానా దగ్గుబాటి. ఆరడుగులకు పైగా హైట్‌తో హీరో అంటే ఇలా ఉండాలని అనిపించుకున్నాడు రానా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా వైవిధ్యమైన చిత్రాలతో ఆకట్టుకున్నారు రానా. కృష్ణం వందే జగద్గురుమ్, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి తదితర సినిమాలు ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయి. హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

భల్లాలదేవుడిగా తిరుగులేని క్రేజ్
హీరోగా ఎదుగుతున్న రానా కెరీర్‌ను మలుపు తిప్పారు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్‌లో భల్లాలదేవుడిగా క్రూరుడిగా భయపెట్టారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ను మించి తన పాత్రతో డామినేట్ చేశారు రానా. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్యారెక్టర్‌లో నటించారు. తర్వాత అరణ్య, భీమ్లా నాయక్, విరాట పర్వం, 1945, వెట్టయన్ చిత్రాలలో ఆయన నటించారు. నటుడిగా, విజువల్ ఎఫెక్ట్స్ కో ఆర్డినేటర్‌గా, టెలివిజన్ ప్రెజెంటర్‌గా, నిర్మాతగానూ, బిజినెస్‌మెన్‌గానూ రాణిస్తూ దగ్గుబాటి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
మిహికాతో ప్రేమ, పెళ్లి
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న మిహికా బజాజ్‌తో ప్రేమలో పడ్డారు రానా దగ్గుబాటి. లాక్‌డౌన్ సమయంలో ఓ యాప్ ద్వారా మిహికా పరిచయం కాగా.. వీరి స్నేహం ప్రేమగా మారింది. ముంబైలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్న మిహీరా స్వస్థలం హైదరాబాదే. పెద్దల అంగీకారంతో వీరి వివాహం జరిగింది. కోవిడ్ మహమ్మారి భారతదేశాన్ని కమ్మేసిన లాక్‌డౌన్ సమయంలో 2020 ఆగస్ట్ 8న రానా- మిహికాల వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగింది. రానా బెస్ట్ ఫ్రెండ్, హీరో రామ్ చరణ్- ఉపాసన దంపతులతో పాటు అల్లు అర్జున్, సమంత, నాగచైతన్య వంటి అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది
గర్భం దాల్చిన మిహికా?
కాగా.. రానా భార్య మిహికా బజాజ్ తాజాగా గర్బం దాల్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఓ మంచి రోజు చూసుకుని రానా - మిహికా దంపతులు ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం ఉందని గాసిప్స్ వస్తున్నాయి. మరి నిజంగానే మిహికా గర్భం దాల్చారా? లేదంటే ఇది కేవలం ప్రచారామా? అనేది త్వరలోనే తేలిపోనుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. మిరాయ్‌లో రానా గెస్ట్ రోల్‌లో కనిపించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్- భాగ్యశ్రీ బోర్సే నటిస్తోన్న కాంత సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











