»   » రానాతో సీక్రెట్ డేటింగ్.. రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ.. ప్రియుడి కోసం..

రానాతో సీక్రెట్ డేటింగ్.. రకుల్ ప్రీత్ సింగ్ క్లారిటీ.. ప్రియుడి కోసం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో ఇద్దర తారలు కలిసి చనువగా ఉంటేనే అనేక రూమర్లు వస్తుంటాయి. ఇక దగ్గుబాటి నట వారసుడు రానా సంగతి చెప్పనక్కర్లేదు. ఆయనకు సంబంధించిన అఫైర్లు ఇప్పటికే బోలెడన్నీ ఉన్నాయి. తాజాగా రానాపై సీక్రెట్ డేటింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. అదేమింటంటే..

రకుల్-రానా ఏంటీ సంగతి ! నిజంగానే విషయం అక్కడిదాకా వెళ్లిందా?
డేటింగ్‌పై రకుల్ ప్రీత్

డేటింగ్‌పై రకుల్ ప్రీత్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్‌, రానా మధ్య సీక్రెట్ డేటింగ్ జరుగుతున్నదని ఆ వార్త సారాంశం. ఈ వార్తపై రకుల్ ఇటీవల ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ధీటైన జవాబిచ్చింది.

రానాతో డేటింగ్ వార్త

రానాతో డేటింగ్ వార్త

రానాతో డేటింగ్ చేస్తున్నాననే వార్త చాలా కాలంగా మీడియాలో నానుతున్నది. దానికి నేనేమి చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ విషయంలో నేను స్పందించడానికి ఏమీ లేదు. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను నేను రానా మంచి స్నేహితులం అని రకుల్ బదులిచ్చింది.

 హైదరాబాద్‌లో సొంతంగా

హైదరాబాద్‌లో సొంతంగా

నేను హైదరాబాద్‌లో సొంతంగా ఇల్లు కొనుకొన్నాను. కుటుంబ సభ్యులకు దూరంగా నేను ఉంటాను. నాకు ఎప్పుడైనా అవసరం పడితే నేను రానా నుంచి హెల్ప్ తీసుకొంటాను. హైదరాబాద్‌లో మాకు ఓ గ్రూప్‌లో ఉంది. ఆ గ్రూప్‌లో 20 మంది దాకా సభ్యులుంటారు. అందులో నేను, రానా కూడా ఉన్నాం అని రకుల్ చెప్పింది.

 రానా ఇంటికి దగ్గర్లోనే

రానా ఇంటికి దగ్గర్లోనే

అంతేకాకుండా రానాకి ఇంటి దగ్గర్లోనే నేను ఉంటాను. మా గ్రూప్‌లో పెళ్లి కాని వాళ్లం కేవలం ముగ్గురు, నలుగురు ఉంటారు. అందులో మేమిద్దరం కూడా ఉన్నాం. నాకు, రానాకు పెళ్లి కాకపోవడంతో రిలేషన్ అంటగట్టి ఉంటారేమో.

నాకు వరుడ్ని వెతకండి

నాకు వరుడ్ని వెతకండి

మేమంత ఓ గ్రూప్‌గా కలిసినప్పుడు సరదాగా మాట్లాడుకొంటాం. మీరు ఏం చేస్తున్నారు. నా కోసం మంచి వరుడ్ని వెతకండి అని నా ఫ్రెండ్స్‌తో జోక్ చేస్తుంటాను. అంత మాత్రాన పెళ్లి చేసుకొంటానా అని రకుల్ మరో ప్రశ్నకు సమాధానం చెప్పింది.

డేటింగ్ సమయం లేదు

డేటింగ్ సమయం లేదు

ప్రస్తుతానికి పెళ్లి, అఫైర్లు, డేటింగ్‌కు నాకు సమయం లేదు. పూర్తిగా నేను కెరీర్‌పైనే దృష్టిపెట్టాను. ఒకవేళ నిజంగా ప్రేమలో పడితే అందరికంటే ముందే నేను ప్రపంచానికి తెలియజేస్తాను అని రకుల్ చెప్పింది.

 రానాతో త్రిష, శ్రియా

రానాతో త్రిష, శ్రియా

కాగా రానా దగ్గుబాటికి పలువురు హీరోయిన్లతో అఫైర్ ఉన్నట్టు గతంలో పలుమార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. త్రిషను పెళ్లి చేసుకొంటున్నారని, ఆ తర్వాత శ్రియా సరన్‌తో అఫైర్ ఉన్నట్టు గాసిప్స్ వచ్చాయి. తాజాగా రకుల్ పేరుతో రానా పేరు ముడిపడటం చర్చనీయాంశమైంది.

English summary
In the film industry, when two people are caught hanging out with each other, there is always a whiff of an alleged affair or a Relationship. Recently linked are Rakul Preet Singh and Rana Daggubati. But in an interview with Hindustan Times, the actress has finally put to rest the rumours of her dating Rana Daggubati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu