twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ‘రెడ్డిగారు పోయారు’ఆగిన వెనక కథ??

    By Srikanya
    |

    హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ గతంలో ప్రకటించి,మొదలు పెట్టకుండా వదిలేసిన 'రెడ్డిగారు పోయారు'చిత్రం మళ్లీ రీసెంట్ గా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన ఈ చిత్రం పోస్టర్ ని విడుదల చేసారు. ఎలక్షన్స్ ముందు ఈ చిత్రం వస్తుందని ప్రకటించారు. కానీ తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చిత్రం ప్రస్తుతానికి ఆగిపోయినట్లే అని తెలుస్తోంది. స్క్రిప్టు ఇప్పటికే పూర్తైనా నిర్మాతలు ఎవరూ ఈ చిత్రం నిర్మించటానికి ముందుకు రాకపోవటంతో ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీ అవుతున్నట్లు చెప్తున్నారు. దానికి తోడు ఎలక్షన్స్ కూడా చాలా దగ్గరగా ఉండటంతో ఈ ప్రాజెక్టుతో పెద్దగా ఉపయోగం ఉండదని భావిస్తున్నారు.

    Is RGV's Reddygaaru Poyaru Stalled?

    పొలిటికల్ సెటైర్ గా ఈ చిత్రం ఉండబోతున్న ఈ చిత్రం వివాదాస్పదంగా టైటిల్ తో మారుతుందని భావించి, ప్రాజెక్టుకి క్రేజ్ తేవటం కోసం వర్మ ఈ పోస్టర్ విడుదల చేసారు. ప్రకాష్ రాజ్ ని కీ రోల్ కి అనుకున్నారు. అయితే నిర్మాతలు ఎవరూ ఈ తరహా తలనొప్పులలో ఇరుక్కోవటం ఇష్టం లేక దూరంగా ఉండటంతో వర్మ ప్రక్కన పెట్టాడంటున్నారు. దానికి తోడు సెన్సార్ ఆఫీసర్ ధనలక్ష్మితో ఆయన గతంలో ఆరోపణలు చేసి మీడియాకి ఎక్కారు. ఇప్పుడు ఈ చిత్రం చేసినా అదే పరిస్ధితి ఎదురౌతుందని భావిస్తున్నారు. టైటిల్ దగ్గర నుంచి అంతా సెన్సార్ కు గురి అయ్యే అవకాసం ఉందని, లేనిపోని తలనొప్పులతో ఇరుక్కోవటం ఆయన నిర్మాతలకు ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే విష్ణుతో టెన్షన్ టెన్షన్ చిత్రం ప్రారంభిస్తున్నారని తెలుస్తోంది.

    గతంలో వర్మ...తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని, అయితే రాజకీయాల మనస్తత్వం తెలుసన్నారు. వైస్ఆర్ మరణం తర్వాత ఆంద్రప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణాలను బేస్ చేసుకుని ఈ సినిమా తీస్తున్నట్లు తెలిపారు. స్ర్కిప్టును రూపొందించే పనిలో ఉన్నామని, త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిణామాల గురించి కొంతమందిని కలవనున్నట్లు కూడా ఆయన చెప్పారు.

    ఈ సినిమాలో తాజాగా రాష్టల్రో నెలకొన్న రాజకీయ సంఘటనలే ఇతివృత్తంగా ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం కుర్చీ కోసం రాజకీయ నేతలు పాకులాడుతున్న వైనాన్ని ఆయన ప్రధాన కథాంశంగా ఉండనున్నట్టు సమాచారం. వైఎస్‌ మరణానాంతరం జరిగిన సంఘటలపైనే సినిమా ఉంటుందని తెలుస్తోంది.

    ఒక మహానాయకుడి మరణం తర్వాత, తమ ఉనికి కోసం రాజకీయ నాయకులు చేస్తున్న వ్యూహ, ప్రతివ్యూహాలను ఈ సినిమాలో చూపిస్తానంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు, అవినీతి కుంభకోణాలు, చానళ్ల పోరు వంటి అంశాలు తనలో ఆసక్తి కలిగించాయని వర్మ చెబుతున్నారు. ఈ వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ 'కల్పిత గాథ'ను తెరకెక్కిస్తున్నా అన్నారు.

    English summary
    Ram Gopal Varma's much-hyped project Reddy Garu Poyaru has been postponed indefinitely, going by our sources.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X