»   » 'వరుడు' అన్వేషణలో డాన్ శ్రియ..!?

'వరుడు' అన్వేషణలో డాన్ శ్రియ..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల తార శ్రియకు ఆమె తల్లిదండ్రులు త్వరలో పెళ్ళి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శ్రియ అందానికి, మనస్తత్వానికి సరిపడా కుర్రాడ్ని వెతికి పట్టుకోవాలని శ్రియ తల్లిందండ్రలు భావిస్తున్నారట. అప్పుడే పెళ్ళెమిటి..అంటూ ఇన్నాళ్ళూ పెళ్ళి విషయాన్ని వాయిదా వేస్తూ వచ్చిన సెక్సీభామ శ్రియ కూడా ఇప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకొస్తేనే తెగ మెలికలు తిరిగేస్తోంది. తెలుగులో 'డాన్ శీను" తో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రియకి తెలుగునాట కాలం కలిసిరాకపోవడం, బాలీవుడ్, కోలీవుడ్ లలోనూ అవకాశాలు సరిగ్గా లేకపోవడంతో పెళ్ళిపీటలెక్కాలని డిసైడ్ అయిపోయిందట.

వరుడు అన్వేషణలో శ్రియ చాలా బిజీగా వుందంటూ వస్తోన్న గాసిప్స్ పై ఆమెను ప్రశ్నిస్తే, 'నా అభిరుచులకు తగ్గ మగాడు దొరికితే పెళ్ళికి నేను రెడీ.." అనేస్తోంది. ఇంతకీ సినిమా పర్సనాలిటీనే పెళ్ళాడతావా..అనడిగితే, మంచి బిజినెస్ మెన్ అయి వుండీ, తన ఇష్టాన్నీ, కోరికల్నీ గౌరవించేవాడైతే మేలని తెగ సిగ్గుపడిపోతూ చెబుతోంది శ్రియ.

ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు, ఓ ఇంగ్లీష్ సినిమా కమిట్ అయ్యింది. ఈ సినిమాలు పూర్తయిన తర్వాత శ్రియ పెళ్లి కూతురవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సో..శ్రియకు కళ్యాణ ఘడియలు వచ్చినట్టేనని చెప్పొచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu