SSMB29 హాలీవుడ్ బాక్సాఫీస్‌పై రాజమౌళి భారీ గురి.. మహేష్ బాబు మూవీకి ఎన్నివేల కోట్ల టార్గెట్ అంటే?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆస్కార్ అవార్డు కోసం RRR సినిమాను ప్రపంచ సినీ దిగ్గజాలకు చేరువ చేయడంలో తన ప్రత్యేకతను నిలుపుకొన్నాడు. అంతర్జాతీయ సినిమా వేదికలపై తెలుగు సినిమా సత్తాను చాటడంలో జక్కన్న సఫలమయ్యాడు.

ఒకవైపు RRR సినిమాతో హాలీవుడ్‌లో తన అస్థిత్వాన్ని స్థిరపరుచుకోవడంతోపాటు మహేష్ బాబుతో తన తదుపరి సినిమా మార్కెట్‌కు మార్గాన్ని సుగమం చేసుకొనే ప్లాన్‌ను కూడా అంతర్లీనంగా అమలు చేయడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. అయితే సోషల్ మీడియాలో మహేష్ బాబుతో రూపొందించబోయే సినిమా గురించి హైప్ ఏ విధంగా ఉందంటే...

 జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్‌తో

జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్‌తో

RRR సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడానికి అమెరికాలో రాజమౌళి టీమ్ విశేషంగా కృషి చేస్తున్నది. ఆస్కార్ అవార్డును ఎలాగైనా సాధించాలనే ఉద్దేశంతో తన సినిమాను స్టివెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి సినీ దిగ్గజాలకు ప్రదర్శించిన విషయం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్‌ను జక్కన కలిసిన ఫోటోలు అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యాయి.

ట్రెండింగ్‌గా SSMB29

ట్రెండింగ్‌గా SSMB29

హాలీవుడ్‌లో RRR సినిమా ప్రమోషన్స్ సందర్భంగా తన తదుపరి సినిమా మహేష్ బాబుతో ఉంటుందనే విషయాన్ని అవసరమైన చోట రాజమౌళి చెబుతున్నారు. ఇండియాలో మహేష్ బాబు సూపర్ స్టార్ మాత్రమే కాకుండా బాక్సాఫీస్ స్టామినా ఉన్న హీరో అంటూ అంతర్జాతీయ మీడియాకు వెల్లడిస్తున్నారు. దాంతో మహేష్ బాబు SSMB29 సినిమా ఇప్పటికే ట్రెండ్ అవుతున్నది.

నా నెక్స్ సినిమా మహేష్ బాబుతోనే

నా నెక్స్ సినిమా మహేష్ బాబుతోనే

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకొన్న తర్వాత కీరవాణి మాట్లాడుతూ.. మహేష్ బాబుతో నా సోదరుడు రాజమౌళి రూపొందించే చిత్రమే తన తదుపరి సినిమా. ఈ సినిమా పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని హలీవుడ్ మీడియాకు కీరవాణి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు అంతేకాకుండా తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచే విధంగా కీరవాణి కృషి చేయడం అభిమానులను ఆకట్టుకొంటున్నది.

ఇండియానా జోన్స్ రేంజ్‌లో

ఇండియానా జోన్స్ రేంజ్‌లో


ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో ప్రారంభమయ్యే సినిమా కోసం రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అయితే ఈ సినిమా ప్రాంచైజీగా రూపొందించేందుకు సిద్దమవుతున్నారు. ఇండియానా జోన్స్ సినిమాను తలపించేలా భారీ అడ్వంచర్ సినిమాను రూపొందించే పనిలో పడ్డారు.

SSMB29 సినిమాకు సీక్వెల్‌ ప్లానింగ్

SSMB29 సినిమాకు సీక్వెల్‌ ప్లానింగ్


మహేష్ బాబు, జక్కన కాంబినేషన్‌లో వచ్చే SSMB29 సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుంది. క్యారెక్టర్ ఏమీ మారకుండా స్టోరీలో సెంట్రల్ థీమ్‌లో మార్పులు ఉంటాయి. పక్కా అడ్వెంచర్ థ్రిల్లర్. ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం అవుతుంది అని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు.

1 బిలియన్ డాలర్లు టార్గెట్‌గా

1 బిలియన్ డాలర్లు టార్గెట్‌గా


RRR సినిమా ముఖ్యంగా రాజమౌళి ఇప్పటికే హాలీవుడ్‌లో భారీగా టార్గెట్ ఆడియెన్స్‌ను సంపాదించుకొన్నారు. పలు దేశాల్లో రాజమౌళి గురించి మరింత పాపులారిటీ లభించింది. దాంతో రాజమౌళి సినిమాపై ఇప్పటి నుంచే మార్కెటింగ్, పబ్లిసిటీ మొదలైంది. ఈ సినిమా ద్వారా ప్రపంచ బాక్సాఫీస్ వద్ద కనీసం 1 బిలియన్ డాలర్లను కొల్లగొట్టేందుకు జక్కన్న భారీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X