twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ‌మూవీకి మరో దెబ్బ.. రాజమౌళి కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా..

    |

    దర్శక ధీరుడు రాజమౌళికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రారంభించిన RRR మూవీకి అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టును అవలీలగా ప్రేక్షకుల ముందుకు తెచ్చిన జక్కన ఇప్పుడు RRR విషయంలో అనేక విఘ్నాలను ఎదుర్కొంటున్నారు. RRR మూవీపై రోజుకో రూమర్ పుట్టుకొస్తున్న తాజాగా మరో అంశం వెలుగు చూసింది. అదేమిటంటే..

    RRR రిలీజ్ వాయిదాల పర్వం

    RRR రిలీజ్ వాయిదాల పర్వం

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న RRR చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య తెరకెక్కిస్తున్నారు. సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే రిలీజ్ డేట్‌పై దర్శకుడు రాజమౌళి క్లారిటీతో ముందుకొచ్చాడు. జూలై 26, 2020 తేదీని రిలీజ్ డేట్‌గా ప్రకటించారు.

    షాకుల మీద షాకులు

    షాకుల మీద షాకులు

    అయితే అంతా సవ్యంగా సాగుతున్నదనుకొన్న సమయంలో హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ గాయాల పాలు కావడంతో రిలీజ్ డేట్‌ను మార్చాల్సి వచ్చింది. దాంతో ఈ సినిమా దసరా నుంచి సంక్రాంతికి వెళ్లింది. చివరకు జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావించారు.

    చివరకు సంక్రాంతికి ఫిక్స్

    చివరకు సంక్రాంతికి ఫిక్స్

    కానీ RRR సినిమా సంక్రాంతి బరిలో కూడా దిగే పరిస్థితి కనిపించడం లేదట. ఆలియా డేట్స్ సమస్యగా మారడం, అంతలోనే కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేయడంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దాంతో ఈ సినిమా జనవరి 2021 కాకుండా ఏప్రిల్‌లో బాహుబలి రిలీజ్ డేట్‌తో రావాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

    Recommended Video

    Tollywood Inside Talk | Pspk27 | RRR | NTR 30 | PSPK 27 | Chiru 152 | Prabhas 20
    రూ.450 కోట్ల బడ్జెట్‌తో

    రూ.450 కోట్ల బడ్జెట్‌తో

    RRR చిత్రంలో విదేశీ నటులు కూడా నటిస్తున్నారు. ఆలిసన్ డూడీ, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. అయితే ప్రాజెక్టులో వీరి చేరిక జరిగిందా? ఎప్పుడు షూటింగ్‌కు హాజరవుతారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రూ.450 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్నది,

    English summary
    Reports suggest that RRR movie release again postponed, SS Rajamouli movie to release on January 8, 2020. SS Rajamouli's RRR will be shot at real locations across the nation, unlike Baahubali which was shot at a grand set. The director's next, RRR will be produced by DVV Danayya having an enormous budget of nearly Rs 350 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X