For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీనియర్ నటికి భారీగా టోకరా.. టాప్ హీరోయిన్ మేనేజర్ 60 లక్షల చీటింగ్‌.. అసలు జరిగిందేమిటంటే!

  |

  సినిమా పరిశ్రమ అంతా ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉండటం కారణంగా అనేక వివాదాలు బయటపడుతుంటాయి. అలాంటి వివాదాలను కొందరు నేరుగా బయటపెడుతుంటారు. మరికొందరి ఆ వివాదంలో సినీ వర్గాల్లోను, మీడియాలో నానుతుంటాయి. ఇలాంటి వివాదాల్లో హీరోయిన్లు, హీరోలను, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులను మేనేజర్లు, నిర్మాతలు ఫైనాన్షియల్ మ్యాటర్స్‌లో మోసగించడం సాధారణంగా బయటకు వస్తుంటాయి. తాజాగా టాలీవుడ్‌లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టును మేనేజర్ చీట్ చేశాడనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివాదంలోకి వెళితే..

  క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తూ

  క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తూ

  దక్షిణాది చిత్రసీమలో హాట్ తారగా కెరీర్‌ను మొదలుపెట్టి ప్రస్తుతం తెలుగులో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తూ మెప్పిస్తున్నారు. అమ్మ, వదిన, అత్తలాంటి పాత్రలకు పెట్టింది పేరుగా మారారు. ఇటీకాలంలో దాదాపు అన్ని సినిమాల్లో ఆమె కనిపిస్తు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. అయితే తన మేనేజర్ డబ్బుల విషయంలో దారుణంగా మోసగించడానే విషయం ఆమె ఆలస్యంగా గ్రహించారు అనే విషయం ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

  భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!

  మేనేజర్ బుకాయింపు

  మేనేజర్ బుకాయింపు

  మేనేజర్ నిర్వాకంతో షాక్ గురైన నటి వెంటనే మేనేజర్‌తో ఈ విషయాన్ని చర్చించింది. అయితే మేనేజర్ అలాంటిది ఏమీ లేదని బుకాయించడంతో సదరు నటి ఇటీవల కాలంలో తాను నటించిన చిత్రాల నిర్మాతలను, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, దర్శకులను, ప్రోడక్షన్ మేనేజర్లను సంప్రదించారు. అయితే వారు చెప్పిన ప్రకారం తాను మోసపోయానని గ్రహించారు అనే విషయం బయటకు వచ్చింది.

  రెమ్యునరేషన్ విషయంలో

  రెమ్యునరేషన్ విషయంలో

  నిర్మాతలు, ఇతరులు చెప్పిన ప్రకారం.. సదరు మేనేజర్ తన రెమ్యునరేషన్ విషయంలో చాలా మోసాలు జరిగాయి. నిర్మాతలు ఇచ్చిన అసలు రెమ్యునరేషన్ కంటే.. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తక్కువ రెమ్యునరేషన్ నుంచి కూడా ఇంకా కమీషన్ తీసుకొన్నాడని తెలియడంతో సదరు నటి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు అనేది తాజాగా మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ సారాంశం.

  60 నుంచి 70 లక్షల వరకు

  60 నుంచి 70 లక్షల వరకు

  రెమ్యునరేషన్ విషయంలోనే తాను మోసపోలేదని, ఇంకా పలు రకాలుగా చీటింగ్‌కు గురయ్యాను అని క్యారెక్టర్ ఆర్టిస్టు దృష్టికి వచ్చింది. తనకు చెల్పించిన రెమ్యునరేషన్‌పై నిర్మాతలు ఇచ్చిన జీఎస్టీ మొత్తాన్ని సదరు మేనేజర్ నొక్కేశాడని, నిర్మాతలు ఇవ్వలేదని చెప్పి నటి నుంచి జీఎస్టీ కట్టించడానే విషయంత తన దృష్టికి రావడంతో సీనియర్ నటి షాక్ గురైంది. దాదాపు 60 నుంచి 70 లక్షల వరకు ఈ మొత్తం ఉంటుందని అంచనాకు వచ్చింది. ప్రస్తుతం మేనేజర్, సదరు తార మధ్య ఈ వివాదం మరింత ముదిరింది.

  రంగంలోకి దిగిన సినీ పెద్దలు

  రంగంలోకి దిగిన సినీ పెద్దలు


  మేనేజర్ నిర్వాకం మీడియాలో రాకముందు ఈ వివాదంలో సీనియర్ నటికి న్యాయం చేసే విషయంలో కొందరు ఇండస్ట్రీ పెద్దలు, మా సంఘంలోని ముఖ్యులు రంగంలోకి దిగారు. వారు ఇద్దరి మధ్య వివాద తీవ్రతను తగ్గించి, ఆ మొత్తాన్ని సదరు నటికి ఇప్పించే పనిలో పడ్డారు. మేనేజర్, సీనియర్ నటికి మధ్య బేరసారాలు జరుగుతున్నాయి అనే విషయం తాజాగా బయటకు వచ్చింది.

  Hero Balakrishna Appreciates Natyam Team | నమః శివాయా అద్భుతమైన పాట
  టాప్ హీరోయిన్‌కు మేనేజర్‌గా

  టాప్ హీరోయిన్‌కు మేనేజర్‌గా

  ఇక మేనేజర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం దక్షిణాదిలో అగ్ర తారగా చెలమణి అవుతున్న హీరోయిన్‌కు చాలా కాలం నుంచి మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇలా చీటింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు రావడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఇద్దరిలో ఎవరైనా స్పందిస్తే కానీ అసలు విషయం బయటకు రాదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

  English summary
  Senior actress has cheated by manager issue become now talk of the industry. As per rumour, Manager cheated about 60 lakhs from Senior actress.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X