వార్ 2 డిజాస్టర్‌తో పీకల్లోతు కష్టాల్లో నాగవంశీ.. నష్టపరిహారంపై యష్ రాజ్ కీలక నిర్ణయం!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్ నాగవంశీకి చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ దక్కింది. ఈయన ప్రొడక్షన్ హౌజ్ నుంచి వచ్చే సినిమా అప్డేట్స్ ఫ్యాన్స్, ఆడియెన్స్ కు ఏకంగా ఈయన్నే అడిగేంతగా ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలన్నింటితో నాగవంశీ కాస్తా మంచి రిజల్ట్ నే అందుకుంటూ వస్తున్నారు. 2016లో ప్రారంభమైన ఈ సంస్థలో నిర్మాతగా నాగవంశీ గుర్తుండిపోయే చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. మంచి కంటెంట్ ను, ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాస్,కామెడీ జోనర్ల చిత్రాలను రూపొందిస్తున్నారు.

దాదాపు 10 ఏళ్లలో సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మాత సూర్య దేవర నాగవంశీ 22 చిత్రాలను రూపొందించారు. అందులో మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. బాబు బంగారం, ప్రేమమ్, జెర్సీ, భీష్మ, రంగ్ దే, డీజే టిల్లు, భీమ్లా నాయక్, సార్, టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, డాకూ మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ వంటి చిత్రాలు మంచి ఫలితాన్ని అందించాయి. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కింగ్డమ్ చిత్రం కమర్షియల్ గా నష్టాన్ని మిగిల్చిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఇదే సమయంలో వార్ 2 ద్వారా కూడా నిర్మాత నాగవంశీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది.

Is War 2 Movie Producers Talked to Naga Vamsi

గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్, జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం వార్ 2. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లోని అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏకంగా 400 కోట్లు ఖర్చు చేసినట్టు ట్రేడ్ నిపుణుల మాట. ఇక ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ రూ.105 కోట్లతో కొనుగోలు చేశారని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. దీంతో తెలుగు స్టేట్స్ లోనే ఈ చిత్రం రూ.210 కోట్ల గ్రాస్ వసూల్ చేయాల్సి ఉంది. భారీ అంచనాలతో వార్ 2 వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకుంది వచ్చింది.

కానీ ఓపెనింగ్ డేనే వార్ 2 చిత్రానికి ఇండియా + ఓవర్సీస్ ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో బాక్సాఫీస్ నెంబర్లపై ప్రభావం చూపిస్తోంది. కాగా వార్ 2 చిత్రం వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.317 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇంకా ఈ చిత్రం 300 కోట్లు వసూళ్లు చేస్తే లాభాల్లోకి రానుంది. ఇక తెలుగు స్టేట్స్ విషయానికొస్తే.. ఇప్పటి వరకు రూ.51 కోట్ల నెట్ వసూల్ చేసింది. దీంతో సినిమా ఇంకా రూ.90 కోట్లకు పైగానే నెట్ వసూళ్లు చేయాల్సి ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతం అంతగా వసూళ్లు చేసే అవకాశం కనిపించడం లేదు. దీంతో నాగవంశీ కోట్లల్లో నష్టపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ఈ క్రమంలో నిర్మాత నాగవంశీకి వార్ 2 చిత్రం మేకర్స్ నష్టపరిహారం చెల్లిస్తామని హామీనిచ్చినట్టు తెలుస్తోంది. నష్టాల్లో కొంత భాగంగా రూ.22 కోట్లు తిరిగి చెల్లిస్తామని భరోసా ఇచ్చారని, ఈమేరకు ఇద్దరి మధ్య ఒప్పందం జరిగినట్టు కూడా సినీ వర్గాల్లో టాక్. నైజాంకు రూ.10 కోట్లు, ఏపీకి రూ.7 కోట్లు, సీడెడ్ కు రూ.5 కోట్లు ఇవ్వబోతున్నట్టు సమాచారం.

More from Filmibeat

Read more about: war 2 jr ntr naga vamsi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X