»   » బాబూ... ముందు ఫ్లాపులకు బ్రేక్ వెయ్యి

బాబూ... ముందు ఫ్లాపులకు బ్రేక్ వెయ్యి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సినిమాలు ఎన్ని వచ్చాయన్నది ఎప్పుడూ ప్రశ్న కాదు..ఎన్ని హిట్స్ ఇచ్చామన్నదే ముఖ్యం. వరస ఫ్లాపులతో సాగుతున్న రామ్ కి ఇప్పటికైనా వాటికి బ్రేక్ వేసే కథనంతో రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. గురువారం రామ్ పుట్టినరోజు. కెరీర్ పరంగా వేగం పెంచాలనీ, ఇకపై వరుసగా సినిమాలు చేయాలని పుట్టినరోజు సందర్భంగా నిర్ణయించుకొన్నారు రామ్. ఈ సందర్బంగా ఆయనకు విషెష్ చెప్తూ...సినిమాలు సంఖ్య పెంచకపోయినా ఫరవాలేదు..చేసేవి తక్కువ సినిమాలు అయినా హిట్స్ ఇస్తే చాలు అంటున్నారు.

'దేవదాస్‌', 'జగడం', 'మస్కా', 'కందిరీగ'... ఇలా ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగాడు. నటన, డ్యాన్సులు, పోరాటాలూ, స్త్టెలింగ్‌.. ఇలా అన్నిటా తనదైన సొంత ముద్ర చూపించుకొన్నాడు. ఇప్పుడు 'పండగ చేస్కో'సినిమాతో మరోసారి వినోదాలు పంచబోతున్నాడు. గురువారం రామ్‌ జన్మదినం. ఈ పుట్టిన రోజుని ఆయన చెన్నైలో జరుపుకొంటున్నారు. అక్కడే 'పండగ చేస్కో' సంగీత చర్చలు జరుగుతున్నాయి.

It is hero Ram's birthday today

తమన్‌ దగ్గర నుంచి మంచి బాణీలు రాబట్టుకొనే పనిలో ఉన్నారాయన. ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకుడు. పరుచూరి ప్రసాద్‌ నిర్మాత. ఈనెల 17 నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇవి కాకుండా మరో రెండు కథలు కూడా రామ్‌ కోసం సిద్ధమవుతున్నాయి. వాటి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

చిత్ర సమర్పకుడు పరుచూరి ప్రసాద్‌ మాట్లాడుతూ ''వాణిజ్య అంశాలన్నీ మేళవించిన కథ ఇది. టైటిల్‌కి మంచి స్పందన వస్తోంది. రామ్‌ నటన, ఆయన పాత్ర తీరుతెన్నులు కొత్తగా ఉంటాయి. మిగిలిన తారాగణాన్ని త్వరలోనే ఎంపిక చేస్తాం'' అన్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ''రామ్‌లోని హుషారుకి తగిన కథ ఇది. మాస్‌, యాక్షన్‌, వినోదం.. ఇవన్నీ కలగలిసి ఉంటుంది. డాన్‌శీను', 'బాడీగార్డ్', 'బలుపు' వంటి హిట్ చిత్రాల తరువాత చేస్తున్న సినిమా ఇది. రామ్ ఎనర్జీకి తగినట్లుగా మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించడానికి సబ్జెక్ట్ రెడీ చేశాం. రామ్‌కిది మరో మంచి సినిమా అవుతుంది' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ''స్క్రిప్టు బాగా వచ్చింది. రామ్‌ కెరీర్‌లో మర్చిపోలేని చిత్రం అవుతుంది. హీరోయిన్, మిగిలిన సాంకేతిన నిపుణుల వివరాలు త్వరలో చెబుతాము''అన్నారు . వరసగా మూడు డిజాస్టర్ ఫ్లాపులు(ఎందుకంటే ప్రేమంట,ఒంగోలు గిత్త,మసాలా) అందించిన రామ్ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

English summary
Ram is going to act in the movie ‘Pandaga Chesko’ very soon. Today is the young hero’s birthday and he is celebrating it in Chennai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu