»   » తమన్నాపై సమంత ఘాటు సెటైర్

తమన్నాపై సమంత ఘాటు సెటైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొద్ది రోజుల క్రితం ..సమంత...తోటి హీరోయిన్ శృతి హాసన్ ఇన్ డైరక్ట్ గా విమర్శిస్తూ తనకు ఇతరుల్లా సినిమా కనెక్షన్స్, బ్యాక్ గ్రౌండ్ లేదని వ్యంగ్య బాణాలు విసిరింది. అయితే ఈ విషయమై శృతి హాసన్ ఏమీ స్పందించలేదు. ఇప్పుడు ఆమె తన వ్యంగ్యాన్ని తమన్నాపై గురి చేసింది.

సమంత మాట్లాడుతూ..."నేను వృత్తిలో ప్రొపిషనల్ గా ఉంటాను. నా పని నటించటలమే. ప్రతీ రోజు ఆఫీస్ కు మా అమ్మను తోడు తీసుకు వెళ్లం కదా...అలాగే నేను షూటింగ్ కు మా అమ్మను కానీ మరెవరినీ కానీ తీసుకు వెళ్లను... ", అంది. సాధారణంగా సమంతతో పాటు ఎప్పుడు ఆమె తల్లి ఉంటూంటుంది. దాంతో ఆమె ఇలా సైటైర్స్ వేసింది. ఇలా అనటానికి కారణమేంటో తెలియదు.

It's Samantha satire on Tamanna?

సమంత తాజా చిత్రం విషయానికి వస్తే...

తెలగులో ఆమె త్రివిక్రమ్ దర్సకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న అ..ఆ చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ఆ పాత్ర చుట్టూనే ఈ చిత్రం తిరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తన దృష్టిని తమిళ సినిమాలపై పెట్టింది.

ధనుష్, సమంత జంటగా 'వడ చెన్నయ్' అనే తమిళ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుంది. ఇందులో హీరోగా న‌టిస్తున్న ధ‌నుష్ ఏకంగా ఈ చిత్ర షూటింగ్ కోసం ఏకంగా రెండు వంద‌ల రోజులు కాల్ షీట్ ఇచ్చేశాడు.

గ్యాంగ్‌స్టర్ జీవితం ఆధారంగా నార్త్ మద్రాస్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇందులో సమంత మురికివాడలకు చెందిన అమ్మాయిగా నటించనున్నారు. మేకప్ లేకుండా నటించడంతో పాటు ఈ చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనున్నారామె. వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభం కానుంది.

English summary
Samantha now targeted Tamanna..and critisized ...while going to office, we don't take our mom and dad along, do we?
Please Wait while comments are loading...