For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బ్రహ్మానందం 'జఫ్ఫా' ఏమైంది?

  By Srikanya
  |
  హైదరాబాద్: హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ దర్శకత్వంలో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'జఫ్ఫా'. ఈ చిత్రం ఎప్పుడో విడుదల అవుతుందనుకుంటే చాలా లేటవుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కి అప్లై చేసి విత్ డ్రా చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని సీన్స్ రీషూట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. సినిమా ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే ఆలోచనతో దర్శక,నిర్మాతలు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

  ఇక ఈ చిత్రం పూర్తి రైట్స్ ని రవితేజ 'వీర'దర్శకుడు రమేష్ వర్మ తీసుకుని నిర్మాత గా మారారని సమాచారం. ఆయనే ఇప్పుడు ఈ చిత్రం బిజినెస్ చూస్తున్నారు. తాజాగా సాయి మనాలి ఎంటర్టైన్మెంట్స్ వారికి ఈ చిత్రం ఆస్ట్రేలియా,న్యూజిల్యాండ్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటుకు అమ్మారు. అలాగే బ్లూ స్కై సినిమా వారికి మిగిలిన ఓవర్ సీస్ రైట్స్ ని ఇచ్చారు.

  కథ పూర్తిగా జైల్లో జరగనుంది. కిరణ్‌ స్టూడియోస్‌ ప్రై.లి. పతాకంపై రమేష్‌వర్మ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈ సందర్బంగా నిర్మాత మాట్లాడుతూ...''జైలు నేపథ్యంలో సాగే కథ ఇది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ జఫ్ఫాగా బ్రహ్మానందం నటన ఆద్యంతం అలరిస్తుంది. నాలుగు పాటలున్నాయి. ఆ పాటల్లోనూ కావల్సినంత వినోదాన్ని మేళవించాం. సునీల్‌ కాశ్యప్‌ మంచి బాణీలను అందించారు'' అని తెలిపారు.

  ఇక ఈ చిత్రం ట్రైలర్ ఆ మధ్యన విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ ట్రైలర్ లో బ్రహ్మానందం.. సంకెళ్లతో ఓ పోలీస్ అధికారి పట్టుకుని ఉంటాడు. అతన్ని నీ పేరేంటి అని అడుగుతాడు. ఎదురుగా ఉన్న బ్రహ్మానందం చెప్పడు. ఇరిటేషన్ తో ఆ పోలీస్ అధికారినీ పేరేంటిరా జప్పా అని అరుస్తాడు. అప్పుడు బ్రహ్మానదం..నా పేరు అదే అని కూల్ గా చెప్పుతాడు. ఆ తర్వాత బ్రహ్మానందం మర్డర్ చేయలేదు, రేప్ చేయలేదు, కిడ్నాప్ చేయలేదు అయినా మోస్ట్ వాంటెడ్ అని వస్తుంది. త్వరలోనే దొరుకుతాడు అనే టైటిల్ కార్డుతో ఈ ట్రైలర్ ముగుస్తుంది.

  ఈ చిత్రంలో బ్రహ్మానందం జఫ్పా ఖాన్ పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. ఇండియన్ పోలీసులుకు చిక్కిన పాకిస్ధాన్ టెర్రరిస్ట్ జఫ్ఫా ఖాన్. ఇండియన్ జైలు నుంచి అతను ఎలా తప్పించుకున్నాడనేది కథలో కీలకాంశంగా ఉంటుంది. అలాగే అతని పోలికలతోనే ఉన్న మరో అమాయిక బ్రహ్మానందాన్ని అడ్డం పెట్టుకుని బయిటపడాలనుకుంటాడు. ఆ క్రమంలో ఏం జరిగింది అనేది కామిడీతో జరిగే కథనం. అలాగే బ్రహ్మానందం తన ఒరిజనల్ తెల్ల గెడ్డంతో జఫ్ఫా ఖాన్ పాత్రలో కనపిస్తారు.

  ఓ స్టార్ హీరోయిన్ గెస్ట్ పాత్ర చేస్తున్న ఈ చిత్రాన్ని మరో కమిడెయిన్ వెన్నెల కిషోర్ స్క్రిప్టు వర్క్ చేసి మెప్పించి,డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం లీడ్ రోల్ లో బ్రహ్మానందం కనిపిస్తారు. మిగతా కీలక పాత్రల్లో రఘుబాబు, అలీ, వేణుమాధవ్‌, శ్రవణ్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: నవీన్‌.

  English summary
  Comedian Dr.Brahmanandam's ‘Jaffa’ directed by Vennela Kishore is attracting the attention of all ever, since the film was announced. Brahmi's expressions and trailers became talking point of the town. According to latest information, in a surprising development, film makers who applied for censor certification withdrew their application from the board. Sources say they want to re-shoot some portions to add to the film. Anup Rubens scoring music for the film which is being produced by Ramesh Varma.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X