Don't Miss!
- Sports
IND vs NZ: మూడేళ్ల తర్వాత సెంచరీ.. ఇక దబిడి దిబిడే అంటున్న రోహిత్ ఫ్యాన్స్!
- News
Oscar 2023కి `నాటు నాటు` నామినేట్: చరిత్ర లిఖించడానికి ఒక్క అడుగు దూరంలో `ఆర్ఆర్ఆర్`
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Finance
womens ipl: ఒకే ఆటలో అంబానీ-అదానీ.. పిచ్ లో నిలిచేదెవరు..? చివరికి గెలిచేదెవరు..?
- Technology
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
Pushpa 2లో సీనియర్ హీరో.. పుష్ప రాజ్ కు మెయిన్ విలన్ గా? సుక్కుతో హ్యాట్రిక్!
పుష్ప.. ఈ సినిమా గురించి ఎంత చెప్పిన తక్కువే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చెసింది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో క్యాస్టింగ్ నుంచి మూవీ టేకింగ్, స్క్రీన్ ప్లే, డైలాగ్ లు, నటీనటుల పెర్ఫామెన్స్ ఒక్కో డైమండ్ అన్నంత టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో ఇటు అల్లు అర్జున్ కు, అటు రష్మిక మందన్నాకు దేశవ్యాప్తంగా పాపులారిటీ లభించింది. అలాగే ఈ సినిమాలో విలన్స్ గా నటించిన సునీల్, ఫహద్ ఫాజిల్ కు సైతం మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక ఇప్పటికే ప్రారంభమైన పుష్ప 2 సినిమాలో క్యాస్టింగ్ గురించి చర్చ జరగుతున్న విషయం తెలిసిందే. 'పుష్ప: ది రూల్' లో టాలీవుడ్ సీనియర్ హీరోను తీసుకోనున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా..
గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందింది. ఇలా దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే అన్ని చోట్లా దీనికి భారీ రెస్పాన్స్ వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. మరీ ముఖ్యంగా హిందీలో ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. ఇక, ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.90 కోట్లు మేర బిజినెస్ జరిగ్గా.. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లు రాబట్టడం విశేషం.

విలన్స్ కు గుర్తింపు..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప మూవీ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీలోని బన్నీ నటన, స్వాగ్, డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో నటించిన యాంకర్ అనసూయతోపాటు సునీల్, మలయాళ స్టార్ నటుడు ఫాహద్ పాజిల్ కు విశేషమైన గుర్తింపు లభించింది.

మెయిన్ విలన్ గా..
ఇక సుకుమార్ సినిమాల్లో విలన్ కు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. అందులో భాగంగానే పుష్పలో ఫహాద్ ఫాజిల్ ను విలక్షణంగా చూపించారు. ఇక ఇప్పుడు రాబోతున్న పుష్ప 2లో మెయిన్ విలన్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ సీక్వెల్ సినిమాలో ఫహాద్ పాజిల్ నే ప్రధాన ప్రతినాయకుడిగా కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఫహాద్ తో పాటు మరో మెయిన్ విలన్ క్యారెక్టర్ ఉంటుందని వార్తలు వచ్చాయి.

ఇదివరకు రెండు సినిమాల్లో..
ఆ ప్రధాన విలన్ రోల్ కు ముందుగా కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సెలెక్ట్ చేశారని ఆ మధ్య తెగ టాక్ వినిపించింది. కానీ తర్వాత అది నిజం కాదని తెలిసింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కు టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబును లెక్కల మాస్టార్ సుకుమార్ ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల్లో విలన్ గా జగతి బాబు అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా జగపతి బాబును విలన్ గా రిపీట్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.

సినీ ఇండస్ట్రీలో టాక్..
అయితే 'పుష్ప: ది రూల్' సినిమాలో ఫహాద్ పాజిల్ కు అండగా ఉంటూ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో, ప్రధాన విలన్ గా జగపతి బాబు కనపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. పుష్పకు సపోర్ట్ గా నిలిచిన రావు రమేష్ కుఎదురు నిలిచే క్యారెక్టర్ లో జగపతి బాబు ఉంటారని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఒకవేళ పుష్ప సీక్వెల్ మూవీలో జగపతి బాబు మెయిన్ విలన్ అయితే.. సుకుమార్ సినిమాలో జగపతి బాబు విలన్ గా చేయడం హ్యాట్రిక్ అవుతుంది.