»   » 'గాయం 2' కు మూలం హాలీవుడ్ చిత్రమా?

'గాయం 2' కు మూలం హాలీవుడ్ చిత్రమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జగపతి బాబు హీరోగా 'గాయం' చిత్రం సీక్వెల్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన ప్రవీణ్ అనే నూతన దర్శకుడు డైరక్షన్ లో వస్తున్న ఈ చిత్రం 'హిస్టరీ ఆఫ్ వయలెన్స్' అనే హాలీవుడ్ చిత్రం ఆధారంగా కథను రూపొందించారని తెలుస్తోంది. కథలో ప్రారంభంలో దుర్గా పాత్ర (జగపతి బాబు)...గూండాగిరికి స్వస్తి చెప్పి బ్యాంకాక్ లో ప్రశాంతంగా హోటల్ నడుపుకుంటూండటంతో ప్రారంభమవుతుందని చెప్తున్నారు. అలాగే ఈ సీక్వెల్ లో అప్పటి గాయంలో ఉన్న దుర్గ, అతని గ్యాంగ్ పదిహేను సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నారనేదే అని చెప్తున్నారు. ఇక రేవతి, కోట తమ తమ పాత్రలను మళ్ళీ చేయటానికి ముందుకు వచ్చారు. ఊర్మిళ కూడా చేసే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu