»   » జగపతి బాబు చేయబోతున్న క్రేజీ సినిమా అదేనా..బాలీవుడ్ లో తొలి సినిమాతోనే!

జగపతి బాబు చేయబోతున్న క్రేజీ సినిమా అదేనా..బాలీవుడ్ లో తొలి సినిమాతోనే!

Subscribe to Filmibeat Telugu

విలన్ గా జగపతి బాబు ఆరంభించిన సెంకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇటీవల రంగస్థలం చిత్రంలో జగపతి బాబు ప్రెసిడెంట్ పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. జగపతి బాబు నటనకు ప్రముఖులందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రెసిడెంట్ పాత్రలో ఆయన పలికించిన హావభావాలు అద్భుతం. కాగా జగపతి బాబు బాలీవుడ్ డెబ్యూ మూవీకి రంగం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

తొలి చిత్రంతోనే ఆయన క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కు బాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దబాంగ్ 3 చిత్రం కోసం అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టు కు రంగం సిద్ధం అవుతోంది. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.

Jagapathi Babu get big offer in Bollywood

ఇటీవలే ప్రభుదేవా సల్లూభాయ్ ని కలసి దబాంగ్ 3 గురించి తుది చర్చలు జరిగిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోనే జగపతి బాబు విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల రంగస్థలం సక్సెస్ ఈవెంట్ లో జగపతి బాబు మాట్లాడుతూ రంగస్థలం చిత్రంలో నటించాక తనకు బాలీవుడ్ లో పెద్ద ఆఫర్ వచ్చిందని ప్రకటించిన సంగతి తెలిసిందే. జగపతి బాబు ప్రస్తావించింది సల్మాన్ ఖాన్ చిత్రం గురించే అని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

English summary
Jagapathi Babu get big offer in Bollywood. Jagapathi Babu to act in Salman Khan movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X