For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ కి ఉన్న ఆప్షన్స్ ఇవి..ఏది బెస్ట్ అంటారు?

  By Srikanya
  |

  హైదరాబాద్ : తమ ప్రాజెక్టులో ఎవరెవరు ఉంటే క్రేజ్ వస్తుంది. పాత్రలకు నిండుతనం వస్తుంది అనేది దర్శకుడు చూసుకుంటాడు. అలాగే హీరో తనతో ఎవరు సమ ఉజ్జీగా విలనీ పండించగలరు...ఎవరు హీరోయిన్ గా తనకు కరెక్టు పెయిర్ అనిపించగలరు అనేది చూసుకుంటూంటారు. ఈ రెండు కరెక్టుగా మ్యాచ్ అయితే సినిమా రేంజి పెరగటమే కాకుండా నిండుతనం ఉంటుంది.

  అలాంటి ఆప్షన్స్ నుంచి ఎంపిక చేసుకోవటంలో బన్నీ ఇప్పుడు బిజీగా ఉన్నాడంటున్నారు. షార్ట్ ఫిలిం చేసి అందరి దృష్టినీ తన వైపుకు మరోసారి తిప్పుకున్న బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ తో మరోసారి సినిమా చేయటానికి సిద్దమవుతున్నారు. అయితే ఆయన సినిమాలో హీరోయిన్ సమంత కాకుండా ఇంకొకరికి చోటు ఉందట. అలాగే విలన్ ఈ రెండు పాత్రలూ ఇంకా ఫిల్ కాలేదట.

  దర్శకుడు హీరోయిన్ కోసం ముగ్గురు పేర్లను పరిశీలనలోకి తీసుకుని ప్రపోజల్ పెట్టారు. అలాగే విలన్ గా చేయటానికి కూడా మరో ముగ్గురుని బన్నీ ముందు పెట్టారు. ఎవరు ఈ ఆప్షన్ లో బన్నీ తో చేయటానికి సెట్ అవుతారు అనేది ఇప్పుడు సస్పెన్స్. ఎవరు చేస్తే బాగుంటనేది మీరూ ఓ లుక్కేసి చెప్పండి...

  స్లైడ్ షోలో... ఆ ఆప్షన్...

  ప్రణీత

  ప్రణీత

  అత్తారింటికి దారేది వరకూ ఓ మాదిరి హీరోయిన్ అనిపించుకున్న ఈ కన్నడ భామ...ఆ సినిమా ఘన విజయంతో లక్కీ హీరోయిన్ గా మారింది. అయితే రీసెంట్ గా వచ్చిన రభస నిరాస పరిచింది. అయితే త్రివిక్రమ్ తో గతంలో ఉన్న పరిచయం ఆమెకు ఉపయోగపడే అవకాసం ఉందంటున్నారు. అయితే పవన్ తో చేసిన ఆమె బన్నీ ప్రక్కన బాగుంటుందా అనేది కొందరి అభిమానుల అనుమానం.

  రాశి ఖన్నా

  రాశి ఖన్నా

  'ఊహలు గుసగుసలాడే'తో ఆకట్టుకొన్నహీరోయిన్ రాశి ఖన్నా, ఓవర్ నైట్ లో ఆమె కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. సినిమా యావరేజ్ అయినా ఆమె సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆమెను తీసుకోవటంతో కొత్త పెయిర్ ని తెరపై చూడవచ్చు. అలాగే కుర్రాళ్ల కలలని మరోసారి ఆవిష్కరించవచ్చు.

  అదా శర్మ

  అదా శర్మ

  నితిన్ హిట్ చిత్రం 'హార్ట్‌ ఎటాక్‌'తో అదా శర్మ అందరికీ నచ్చేసింది. అయితే ఆమె కెరీర్ ఆ తర్వాత ఊహించిన రేంజిలో వెలగలేదు. రకరకాల కారణాలు ఉన్నా ఇప్పుడు ఆమె అల్లు అర్జున్ సరసన చేయటానికి ఆసక్తి చూపిస్తోంది. పెయిర్ కూడా బాగుంటందంటున్నారు. హార్ట్ ఎటాక్ కూడా బాగానే ఆడటంతో ఆమె హిట్ హీరోయిన్ క్రిందే లెక్క.

  జగపతిబాబు

  జగపతిబాబు

  ఇక విలన్ విషయానికి వస్తే... లెజండ్ చిత్రంతో జగపతిబాబు విలన్ గా అవతారమెత్తి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. దాంతో అచ్చ తెలుగు విలన్ అదీ స్టైలిష్ గా కావాలనుకున్నవారు ఆయన్ను సంప్రదిస్తున్నారు. రజనీ లింగా చిత్రంలో చేస్తున్న ఆయన్ను తీసుకోవటం ద్వారా ప్రాజెక్టుకు ప్రత్యేకమైన క్రేజ్ వస్తుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.

  అర్జున్

  అర్జున్

  అర్జున్ కి తెలుగు నాట మంచి మార్కెట్ ఉంది. దాదాపు హీరో రేంజి ఇమేజ్ ఉన్న అర్జున్...బాడీ ఇప్పటికీ స్టిఫ్ గానే మెయింటైన్ చేస్తున్నారు. ఆయన్ను తీసుకోవటం ద్వారా తమిళ మార్కెట్ కూడా ఈజీ అయిపోతుంది.

   ఉపేంద్ర

  ఉపేంద్ర

  గతంలో ఉపేంద్ర హీరోగా చేసిన సినిమాలు తెలుగులో మంచి సక్సెస్ నే రుచి చూసాయి. ఆయన నటిస్తున్నారంటే ఖచ్చితంగా అంచనాలు బాగుంటాయి. అదే సమయంలో కన్నడ నాట కూడా ఆయనకు ఉన్న క్రేజ్ బెంగుళూరు, బళ్లారి వంటి ప్రాంతాల మార్కెట్ విస్తరణకు బాగా ఉపయోగపడుతుంది.

  సమంత

  సమంత

  ఇప్పటి వరకూ హీరోయిన్ గా సమంత మాత్రం ఫైనల్ అయ్యింది. త్రివిక్రమ్ తో ఆమె అత్తారింటికి దారేది చిత్రం చేసింది. ప్రస్తుతం ఆమె నటిస్తే సినిమా హిట్ అనే పరిస్ధితి ఉంది. దాంతో సమంత,ప్రణీతను తీసుకుని త్రివిక్రమ్ మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.

  షూటింగ్ ఎప్పటినుంచీ

  షూటింగ్ ఎప్పటినుంచీ

  ఈ నెల 22న చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలున్నాయి. కె.రాధాకృష్ణ నిర్మాత. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌

  త్రివిక్రమ్ తో...

  త్రివిక్రమ్ తో...

  అల్లు అర్జున్, త్రివిక్రమ్ ది సూపర్ హిట్ కాంబినేషన్. జులాయి' కలయిక మళ్లీ సందడి చేయబోతూండటంతో ప్రాజెక్టుకి మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దటానికి త్రివిక్రమ్ స్క్రిప్టు రాసుకున్నారని వినికిడి

  అల్లు అర్జున్

  అల్లు అర్జున్

  రేసుగుర్రం తర్వాత రకరకాల కథలు విన్న బన్నీ మళ్లీ ఈ ప్రాజెక్టువైపై మొగ్గు చూపారు. తన ఇమేజ్ కు తగ్గ కథ కావాల్సిరావటం, హిట్ కాంబినేషన్ కావాలనుకోవటంతో ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ అవుతోందని వినికిడి.

  English summary
  Jagapathi Babu may soon lock horns with Allu Arjun in his upcoming entertainer under Trivikram Srinivas' direction. Hunt for other hero-ine is on. Rajendra Prasad is playing key role in the film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X