»   » హాట్ టాపిక్ : రామ్ చరణ్ సినిమాలో జగపతిబాబు

హాట్ టాపిక్ : రామ్ చరణ్ సినిమాలో జగపతిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jagapathi Babu
హైదరాబాద్ : రామ్ చరణ్ తో తీస్తున్న సినిమాలో జగపతిబాబును ఓ కేరక్టర్ చేయమని కృష్ణవంశీ సంప్రదిస్తున్నట్టు తెలిసింది. రీసెంట్ గా లెజండ్ చిత్రం ప్రోమో చూసి ఆ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో కృష్ణవంశీ తన అంతః పురం, సముద్రం సినిమాల్లో వెరయిటీగా జగపతిబాబుని చూపించి మెప్పించారు. ఇప్పుడు అదే తరహాలో చిత్రంలో కీలకమైన పాత్రకి ఆయన్ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పాత్ర రామ్ చరణ్ తండ్రి అని విశ్వసనీయ సమాచారం. మొదట ఈ పాత్రకు నాగార్జున అనుకున్నారు.

రిలీజు అయిన తన సినిమాల్లో సక్సెస్ రేటు తగ్గడంతో జగపతి బాబు హీరో చట్రం నుండి బయటకు వచ్చి ఏకంగా విలన్ అవతారం ఎత్తారు. బాలయ్య హీరోగా రూపొందుతున్న లెజెండ్ సినిమా ద్వారా విలన్ అవతారం ఎత్తారు. విలన్ గా జగపతిబాబు గెటప్ బాగుండటంతో చాలా మంది హీరోలు జగపతి బాబును తమ సినిమాల్లో పెట్టుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే జగపతిబాబు పిల్లా నువ్వులేని జీవితంలో ఒక ముఖ్యభూమిక పోషిస్తుండటంతో ఆ సినిమాకు కాస్త క్రేజ్ పెరిగింది.

ఇక చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. తాత, మనవడుగా రాజ్‌కిరణ్‌, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


రామ్ చరణ్ తొలిసారిగా పల్లెటూరి నేపథ్యమున్న యువకుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ నెల 26 వరకు పొల్లాచ్చిలోనే చిత్రీకరణ కొనసాగుతుంది. అనంతరం హైదరాబాద్‌లో రూపొందించిన సెట్‌లో కుటుంబ నేపథ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు.

మే నుంచి విదేశాల్లో చిత్రీకరణ జరుపుతారని సమాచారం. ''కుటుంబ అనుబంధాలతో పాటు, చరణ్‌ శైలికి తగ్గ మాస్‌ అంశాలు కూడా చిత్రంలో ఉంటాయి''అని నిర్మాత చెబుతున్నారు. నలభై రోజులపాటు ఈ షెడ్యూల్‌ సాగుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ- ''కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు, తెలుగు సంప్రదాయాలు కలగలిపి తీర్చిదిద్దుకున్న కథ ఇది. సినిమాలో రామ్‌చరణ్‌ కొత్తగా కనిపిస్తాడు. శ్రీకాంత్‌ ఇందులో రామ్‌చరణ్‌కి యంగ్‌ బాబాయిగా కనిపిస్తారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ పాత్ర చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నాగర్‌కోయిల్‌, పొల్లాచ్చిలోనూ చిత్రీకరణ జరుపుతాము''అన్నారు.


కృష్ణవంశీ మాట్లాడుతూ... తాను ప్రస్తుతం రామ్ చరణ్ తో 'మురారి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని కృష్ణ వంశీ చెప్పుకొచ్చారు.ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

English summary
Ram Charan has got new father on screen. Yesteryear hero Jagapathi Babu, who is all set to test his waters as villain in upcoming Legend, will be stepping into shoes of Charan's father role in Krishna Vamsi's ongoing project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu