రోజుకి 5 లక్షలు చాలంటున్న తెలుగు హీరో

By Srikanya

హైదరాబాద్ : ఊహించని విధంగా మార్కెట్ రోజు రోజుకీ డౌన్ అయిపోతుంటే ఏం చేస్తాం..మార్కెట్ ని బట్టి,డిమాండ్ ని బట్టి రేటు తగ్గించి నిర్మాతలను ఎట్రాక్ట్ చేసే మార్గం చూసుకుంటాం. ప్రస్తుతం జగపతిబాబు ఇదే రూటులో ప్రయాణిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. రోజుకి ఐదు లక్షలు ఇస్తే చాలని ఈ ఫ్యామిలి హీరో ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు. బ్రహ్మానందంలాగే రోజు వారీ కాల్షీట్ లకు రెడీ అవుతున్నారు. అలాగే తను హీరో,విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు ఏదైనా చెయ్యటానికి రెడీ అంటున్నాడని తెలుస్తోంది. అయితే ఆ సినిమా మాత్రం మరీ శాటిలైట్ సినిమాలాగ ఉండకూడదనేది ఆయన ఆశయం అని చెప్తున్నారు.

ఎవరో ఒకరు కొత్త తరహా పాత్రల్లో నటించడానికి ముందుకు రావాలని భావించాను కాబట్టే ఓ అంతఃపురం, హనుమాన్‌జంక్షన్ వంటి సినిమాలొచ్చాయి. ఇకపై పాత్ర, నిర్మాణ సంస్థ, దాన్ని చక్కగా తెరకెక్కించగల దర్శకుడు ఈ మూడు కరెక్ట్‌గా కుదిరాయన్న నమ్మకం కలిగితే ఇకపై కూడా మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే అని జగపతిబాబు ప్రకటించారు. కానీ ఆయనతో మల్టిస్టారర్ చిత్రాలు నిర్మించేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు.

ఇక శివతాండవం సినిమాపై జగపతిబాబు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ''నటుడికి పరిమితులంటూ ఏమీ ఉండకూడదు. శివతాండవం కథ వినగానే నటించేందుకు ఒప్పుకొన్నా. దర్శకుడు కథ తయారు చేసుకొని సరాసరి నా దగ్గరికే వచ్చాడు. వాళ్లు అనుకొనుంటే ఆ పాత్రకు వేరెవర్నైనా తీసుకోవచ్చు. కానీ నాపై నమ్మకంతో నన్ను సంప్రదించారు. ఇలాంటి కథల్లో నటిస్తే... తెలుగులోనూ నా కెరీర్‌కి మేలు జరుగుతుందనే నమ్మకంతో ఈ సినిమా ఒప్పుకొన్నా'' అని జగపతిబాబు చెప్తున్నారు.

అలాగే ఆయన తాజా చిత్రం 6 కూడా డిజాస్టర్ అయ్యింది. . ప్రస్తుతం తెలుగులో ఏప్రియల్ ఫూల్', 6, ఆపరేషన్ దుర్యోధన2 చిత్రాలు చేస్తున్నాడు. కన్నడలో సుదీప్ హీరోగా చేస్తున్న చిత్రంలో ఇన్వెస్టిగేటీవ్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రాలతో పాటు తమిళంలో మరో సినిమా చేయబోతున్నారు. అది నవంబర్ 24న మొదలవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X