ప్రభాస్‌తో జగపతిబాబు ఫైట్.. బయటపడ్డ ఆసక్తికర విషయం!
ప్రభాస్ నటించిన 'సాహో' ఆశించిన మేర ఫలితం రాబట్టలేదు. దీంతో తన తదుపరి సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టి సక్సెస్ సాధించాలని కసిగా ఉన్నారు యంగ్ రెబల్ స్టార్. ఈ మేరకు రాధాకృష్ణ దర్శకత్వంలో కమిటైన కొత్త సినిమా సెట్స్‌పై చురుకుగా కదులుతున్నారు. హై రేంజ్ బడ్జెట్‌తో యంగ్ రెబల్ స్టార్ కెరీర్‌లో మరో భారీ సినిమాగా ఈ మూవీ రూపొందుతోందని సమాచారం.
ప్రభాస్ కెరీర్‌లో 20వ సినిమాగా అలరించబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా తాజాగా చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు కూడా భాగం కానున్నారని తెలుస్తోంది. విలన్‌గా కీలక పాత్ర పోషించనున్న ఆయన.. ప్రభాస్‌తో బిగ్ ఫైట్ చేయనున్నారని తెలుస్తోంది.

గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి 'ఓ డియర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తాజా సమాచారం. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ప్రమోద్, వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కమల్ కన్నన్ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విభాగంలో పని చేస్తుండడం విశేషం.


Click it and Unblock the Notifications











