»   » మహేష్ బాబు మామూలోడు కాదు: ఆ వివాదానికి మద్దతు ఇచ్చింది అందుకే?

మహేష్ బాబు మామూలోడు కాదు: ఆ వివాదానికి మద్దతు ఇచ్చింది అందుకే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత సౌమ్యుడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆయన వీలైనంత దూరంగా ఉంటారు. తన సినిమాలు, తన ఫ్యామిలీ... తన శక్తిమేర సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప ఇతర అంశాల్లో వేలు పెట్టే రకం కాదు.

అయితే ఆ మధ్య తమిళనాడులో జల్లికట్టు క్రీడ విషయంలో పెద్ద వివాదం రేగినపుడు, తమిళనాట జరుగుతున్న జల్లికట్టు ఉద్యమానికి మహేష్ బాబు తన వంతు మద్దతు ఇచ్చారు. ఏకంగా తన అపీషియల్ ట్వీట్టర్ పేజీ ద్వారా తన ఫుల్ సపోర్ట్ ప్రకటించారు.

అయితే మహేష్ బాబు ఇలా చేయడం వెనక ముఖ్యమైన కారణం ఉందని... తాజాగా ఓ విషయం వెలుగులోకి వచ్చింది.

మహేష్ సినిమాలో జల్లికట్టు

మహేష్ సినిమాలో జల్లికట్టు

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ ద్విబాషా చిత్రం తెరకెక్కుతోంది. తమిళంలో మహేష్ బాబు చేస్తున్న తొలి చిత్రం ఇది. ఈ సినిమాలో జల్లికట్టు క్రీడపై సీన్లు ఉంటాయని తెలుస్తోంది.

తమిళ అభిమానం పొందేందుకు

తమిళ అభిమానం పొందేందుకు

తమిళ జనాలకు బాషాభిమానంతో పాటు తమ సంస్కృతిపై అభిమానం ఎక్కువ. దాన్ని కాపాడుకోవడానికి వారు ఎంతకైనా తెగిస్తారు అనడానికి జల్లికట్టు ఉద్యమమే నిదర్శనం. తొలిసారిగా తమిళంలో సినిమా చేస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు వారి మనోభావాలను గౌరవించడంలో భాగంగానే జల్లికట్టుకు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.

జల్లికట్టును చేర్చిన మురుగదాస్

జల్లికట్టును చేర్చిన మురుగదాస్

వాస్తవానికి మహేష్ బాబు, మురుగదాస్ మూవీలో ముందుగా స్క్రిప్టు ప్రకారం జల్లికట్టు క్రీడకు సంబంధించిన సీన్లు లేవట. అయితే ఇటీవల తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ఉవ్వెత్తున లేచిన నేపథ్యంలో సినిమాలో మరింత ఎమోషన్ చేర్చేందుకు, మహేష్ బాబుకు తమిళ ప్రజలతో మంచి బాండ్ ఏర్పరిచేందుకు ఈ సీన్లు పెట్టినట్లు తెలుస్తోంది.

నిజమా? కాదా?

నిజమా? కాదా?

జల్లికట్టు సీన్లు మహేష్ బాబు-మురుగదాస్ మూవీలో ఉన్నాయా? లేవా? అనే విషయమై అఫీషియల్ సమాచారం అయితే లేదు. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో ప్రచారం మాత్రం జరుగుతోంది.

సంభవామి యుగే యుగే

సంభవామి యుగే యుగే

ఈ చిత్రానికి ఇప్పటి వరకు అఫీషియల్ గా టైటిల్ ప్రకటించలేదు. అయితే సంభవామి యుగు యుగే అనే టైటిల్ ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మహేష్ బాబు డౌట్: ‘ఘాజీ’ మూవీ ఎలా చూడాలంటూ...

మహేష్ బాబు డౌట్: ‘ఘాజీ’ మూవీ ఎలా చూడాలంటూ...

ఇండియన్ తొలి సబ్ మెరైన్ కాన్సెప్టు మూవీగా తెరకెక్కిన ‘ఘాజీ' చిత్రాన్ని చూసేందుకు మహేష్ బాబు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎలా చూడాలంటూ ఈ చిత్రానికి కెమెరామెన్ గా పని చేసి మాదీకి ఫోన్ చేసి అండిగారట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

మహేష్ బాబు వైఫ్ నమ్రత మల్టీస్టారర్ ద్వారా రీ ఎంట్రీ!

మహేష్ బాబు వైఫ్ నమ్రత మల్టీస్టారర్ ద్వారా రీ ఎంట్రీ!

మహేష్ బాబు భార్య, మాజీ మిస్ ఇండియా, నటి నమ్రత శిరోద్కర్ త్వరలో సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా మల్టీ స్టారర్ మూవీ ద్వారా మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

కోర్టుకు రావాల్సిందే: హీరో మహేష్ బాబుకు సమన్లు!

కోర్టుకు రావాల్సిందే: హీరో మహేష్ బాబుకు సమన్లు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 3న కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

నడవలేని స్థితిలో.... మహేష్ బాబు 23 ఫోటోస్ లీక్!

నడవలేని స్థితిలో.... మహేష్ బాబు 23 ఫోటోస్ లీక్!

కొంత కాలంగా మహేష్ బాబు 23వ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఫోటోలు లీక్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఫోటో లీక్ అయింది. నడవలేని స్థితిలో ఆసుపత్రిలో మహేష్ బాబు ఉన్న ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది. పూర్తి వివరాలు, ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
Film Nagar sour said that, AR Murugadoss has planned a special episode based on Jallikattu in 'Sambhavami'. These portions were included in the climax block to generate the right kind of emotion. Scenes of bull-taming sport will help Tamilians develop an emotional bond with Mahesh Babu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu