»   » పవన్ పార్టీ పోస్టర్స్ ని సినిమాలో వాడేసారు

పవన్ పార్టీ పోస్టర్స్ ని సినిమాలో వాడేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jana Sena Party’s Poster Controversy
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ పేరుని లేదా పవన్ విజువల్స్ ని, డైలాగ్స్ ని ఏదో విధంగా సినిమాల్లో వాడుకోవటం ఈ మద్యన ఎక్కువైంది. అయితే ఇప్పుడా సీన్ జనసేనకు సైతం మొదలైంది. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పోస్టర్ ని తమ సినిమాలో వాడుకుని క్రేజ్ తెచ్చుకుంటున్న వైనం చాలా మంది సినిమా వారినే కాక బయిటవారిని సైతం ఆశ్చర్యపరుస్తోంది. సినిమాల్లో బ్రాండిగ్ లు బ్యాక్ గ్రౌండ్ లో వాడటం కొత్త కాకపోయినా జనసేన ని వాడటంతో జనం దృష్టి సినిమా మీద కన్నా దీనిమీదకు ఎక్కువ వెళ్ళటం ఆలోచించాల్సిన విషయం.

రీసెంట్ గా విడుదలైన భద్రమ్ అనే తమిళ చిత్రం డబ్బింగ్ లో చాలా చోట్ల ఈ జనసేన పోస్టర్స్ కనిపిస్తాయి. హీరో ఫోన్స్ లో మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వీటిని అమర్చారు. అయితే ఈ చిత్రాన్ని విడుదల చేసిన వారు గత కొంతకాలంగా మెగా స్టార్ కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతున్న పీఆర్వో లు కావటం విశేషం. తమిళంలో రూపొందిన 'తెగిడి' ని డబ్బింగ్ చేసి శుక్రవారం విడుదల చేసారు. మర్డర్‌ మిస్టరీ నేపథ్యం ఉన్న సినిమా ఇది.

Jana Sena Party’s Poster Controversy

కథేమిటంటే... క్రిమినాలజీ పూర్తి చేసిన వేణు(అశోక్ సెల్వన్)కి రాడికల్ డిటెక్టివ్ సర్వీస్ లో డిటెక్టివ్ జాబు రావడంతో హైదరాబాద్ కి వచ్చి అమీర్ తో పాటు ఉంటాడు. వేణు కంపెనీ తనకు ఇచ్చిన ప్రతి కేసుని చాలా పర్ఫెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఫినిష్ చేస్తుంటాడు. అలా ఓ రోజు వేణు చేతికి మధు శ్రీ(జనని అయ్యర్) ఫెయిల్ వస్తుంది. వేణు తన గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె తో పరిచయం పెంచుకుంటాడు. వారిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది.అప్పుడే వేణుకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. తను ఇన్వెస్టిగేట్ చేసిన ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఏమిటి దీని వెనక ఉన్న మిస్టరీ అనేది మిగతా కథ.

నిర్మాత జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ...తమిళంలో తెగిడి సినిమా చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్‌ అయింది. ఈ చిత్రానికి పాజిటివ్‌ రివ్యూలొచ్చాయి. ఫస్ట్‌ కైండ్‌ ఆఫ్‌ థ్రిల్లర్‌. ఇటీవలే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రానికి ఆర్‌.ఆర్‌.బాగా కుదిరింది. ఇదొక డిఫరెంట్‌ జోనర్‌. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ. ఆడియన్స్‌కి బాగా రీచ్‌ అవుతుంది. తమిళంలో భారీ వసూళ్లు చేయడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా చిత్రం అందుకుందని, భద్రమ్ చిత్రానికి 4/5 రేటింగ్ వచ్చిందని తెలిపారు. ప్రతిక్షణం ఉత్కంఠభరితంగాసాగే సస్పెన్స్ థ్రిల్లర్‌ అన్నారు.

English summary

 ‘Bhadram’ is the latest dubbing film that’s imported from Tamil language and co-produced by Shreya’s Media. More than the film’s content, the usage of Pawan Kalyan’s Jana Sena Party posters in Bhadram movie was in the news since a day or two.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu