»   » కొరటాలకు ఎన్టీఆర్ గిఫ్ట్ : ఏం ఇస్తున్నాడో తెలుసా?

కొరటాలకు ఎన్టీఆర్ గిఫ్ట్ : ఏం ఇస్తున్నాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ఇది. దీంతో తెలుగు సినిమా చరిత్రలో కలెక్షన్ల పరంగా టాప్ 3 పొజిషన్ దక్కించుకుంది.

ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గాదాపు రూ. 120 కోట్ల గ్రాస్... రూ. 80 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. తన కు ఇంత పెద్ద హిట్ ఇచ్చి, తన అభిమానులు తలెత్తుకునేలా చేసిన దర్శకుడు కొరటాల శివకు ఏదైనా భారీ గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తున్నాడట ఎన్టీఆర్.


గతంలో కొరటాల శివ మహేష్ బాబు కెరీర్లోనే భారీ విజయాన్ని 'శ్రీమంతుడు' రూపంలో అందించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో పొంగిపోయిన సూపర్ స్టార్ కొరటాలను ఆడి షోరూంకు తీసుకెళ్లి లగ్జరీ కారును గిఫ్టుగా ఇచ్చాడు.


ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నాడో తెలుసా?

ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇస్తున్నాడో తెలుసా?

కొరటాల శివకు ఆల్రెడీ మహేష్ బాబు ఇచ్చిన ఖరీదైన కారు ఉంది. అయితే ఆయనకు హైదరాబాద్ లో సొంతిల్లు లేదు. రెంటెడ్ హౌస్ లోనే ఉంటున్నాడట. ఇది గమనించిన ఎన్టీఆర్ ఆయన కోసం డుప్లెక్స్ విల్లా గిఫ్టుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.


నిజమో? కాదో?

నిజమో? కాదో?

అయితే డుప్లెక్స్ ఇల్లు ఎన్టీఆర్ గిఫ్టుగా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నడని ప్రచారం జరుగుతుంది కానీ... అపీషియల్ గా మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. అది నిజమో? కాదో? తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


ఇండియాలో టాప్ 3

ఇండియాలో టాప్ 3

తాజాగా విడుదలైన ఇండియన్ బాక్సాఫీసు రిపోర్టు(అనధికారిక) ప్రకారం.......ఈ ఏడాది అత్యధిక గ్రాస్ సాధించి ఇండియన్ సినిమాల్లో తొలి స్థానంలొ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ మూవీ సుల్తాన్(224 కోట్ల షేర్), రెండో స్థానంలో సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కబాలి(170 కోట్ల షేర్).... ఆ తర్వాత స్థానాన్ని జనతా గ్యారేజ్(రూ. 80 కోట్ల షేర్) సినిమా ద్వారా ఎన్టీఆర్ దక్కించుకున్నాడని ట్రేడ్ వర్గాల టాక్.


బాహుబలి తర్వాతి స్థానం దక్కించుకునే దిశగా...

బాహుబలి తర్వాతి స్థానం దక్కించుకునే దిశగా...

జనతా గ్యారేజ్ ఇప్పటి వరకు రూ. 80 కోట్ల షేర్ సాధించి మూడో స్థానంలో ఉంది. రూ. 85 కోట్ల షేర్ తో శ్రీమంతుడు రెండో స్థానంలో ఉంది. సినిమా ఇంకా థియేటర్లలో రన్ అవుతున్న నేపథ్యంలో ఆ సినిమాను అధిగమిస్తుందా? లేదా? బాహుబలి తర్వాతి స్థానాన్ని దక్కించుకుంటా? అనేది ఆసక్తికరంగా మారింది.


English summary
It is learnt from sources close to Young Tiger that he is going to gift him with a duplex house! Koratala is currently staying in a rental accommodation so it makes a perfect gift to his director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu