»   » ఎన్టీఆర్ కు కోపం వెళ్లిపోబోయాడు, కానీ సమంత సారి చెప్పి...

ఎన్టీఆర్ కు కోపం వెళ్లిపోబోయాడు, కానీ సమంత సారి చెప్పి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ లో ఇప్పటివరకూ బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస,జనతాగ్యారేజ్ అంటూ నాలుగు చిత్రాలు వచ్చాయి. దాంతో వారిద్దరి మధ్యా మంచి అనుబంధమే ఉంది. తాజాగా వచ్చిన జనతాగ్యారేజ్ చిత్రం ప్రమోషన్స్ లో మాత్రం సమంత ఎన్టీఆర్ కు కోపం తెప్చించింది. అయితే ఎన్టీఆర్ కు ఎందుకు కోపం వచ్చిందంటారా...అయితే ఈ కథనం చదవండి.

జనతాగ్యారేజ్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్, దర్శకుడు కొరటాల శివ ప్రత్యేక ఇంటర్వూలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఇదే పనిలో ఓ టీవి ఛానెల్ లైవ్ ఇంటర్వూకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఎన్టీఆర్ కు సమంత కోపం తెప్పించింది. ఎందుకంటే సమంత చాలా లేటుగా వచ్చింది. ఈ ఇంటర్వూ సమంత, కొరటాల, ఎన్టీఆర్ తో కలిసి చేసారు.


Janatha Garage Promotion:Jr NTR Angry On Samantha

లైవ్ షో కు సమయానికి ముందే ఎన్టీఆర్, కొరటాల వచ్చారచు. కానీ వీళ్లిద్దరూ వచ్చిన నలభై ఐదు నిముషాలకు గానీ సమంత రాలేదు. సమంత కోసం దాదాపు నలభై నిముషాలకు పైగా వెయిట్ చేసిన ఎన్టీఆర్ ,...విసుగెత్తి ఓపిక నశించడంతో ఎన్టీఆర్ లేచి వెళ్దామని ఫిక్స్ అయ్యారు. కరెక్ట్ గా అప్పుడే
సమంత వచ్చింది.


ఇక సమంత ను చూసిన వెంటనే ఎన్టీఆర్ కోపం వచ్చింది. ఆమెపై కోపంగా ఫైర్ అవ్వబోయారు. లేచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాడు. ఈలోగా విషయం గమనించిన సమంత వెంటనే సారి చెప్పింది. అంతేకాకుండా తన లేటుకు కారణం చెప్పింది. ఆ కారణం చెప్పిన వెంటనే ఎన్టీఆర్ కూల్ అయ్యారు.


సమంత చెప్పిన విషయం ఏమిటి అంటే...తాను ఓ ఛారిటి పోగ్రామ్ కు వెళ్లటం వెల్లనే లేట్ అయ్యిందని సమంత చెప్పింది. దాంతో ఎన్టీఆర్ కూల్ అయ్యి..ఆమెను మెచ్చుకుని ఇంటర్వూలో కూర్చున్నట్లు తెలిసింది. అదీ విషయం.

English summary
It was heard that the top actress samantha has recently infuriated Jr NTR. NTR, film’s director Koratala Siva, and Samantha teamed up for a special interview. Samantha is heard to have reached almost an hour late for the interview shoot and made both the star and his director wait until then.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu