twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రిలీజైనా పెద్దగా ఏం ఒరుగుతుంది

    By Srikanya
    |

    హైదరాబాద్ : తమ సినిమా రిలీజ్ అవుతుందంటే హీరోలు ఉత్సాహంగా ఉంటుంది. కానీ నాని పరిస్ధితి రివర్స్ గేర్ లో ఉందంటున్నారు. తమిళంలో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకున్న 'జెండాపైకపిరాజు' చిత్రం తెలుగులో రిలీజ్ అయ్యి మాత్రం నానికి ఏం ఒరగపెడుతుంది అంటున్నారు. ఫైనాన్స్ సమస్యలతో ఆగిపోయిన ఈ చిత్రం తిరిగి రిలీజ్ కు సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. అంతా సెట్ అయితే ఈ నెలాఖరుకు విడుదల అయ్యే అవకాసం ఉంది. నాని, అమలాపాల్‌ జంటగా తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించిన చిత్రం 'జెండాపైకపిరాజు'. రాగిణి ద్వివేది కీలకపాత్ర పోషించింది. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, శివరామన్‌, రజిత్‌ పార్థసారధి నిర్మాతలు.

    దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ...ఈ దేశానికి ఏం చేయొద్దు. సొంత వూరుని బాగు చేయొద్దు. పనులన్నీ మానేసి పక్కవాడికి సేవ చేయొద్దు. నీకు నువ్వు బాగుపడు... చాలు. ఈ దేశం దానికదే బాగుపడుతుంది. మా కథలో ఇదే చెబుతున్నాం అంటున్నారు సముద్రఖని.

    Janda Pai Kapiraju getting ready for release

    నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రతి వ్యక్తి తననితాను సంస్కరించుకొంటే దేశాన్ని సంస్కరించినట్టే. ఈ అంశం చుట్టూ నడిచే చిత్రమిది. నాని ద్విపాత్రాభినం చేశారు. రెండు పాత్రల్లోనూ ఆయన నటన ఆకట్టుకొంటుంది. శరత్‌కుమార్‌ ఓ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. జీవి ప్రకాష్‌ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. నాని మొట్ట మొదటి సారిగా పూర్తి స్థాయిగా మాస్ పాత్ర పోషిస్తున్నాడు. "శంభో శివ శంభో'' చిత్రం తో దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన సముద్రఖని ఈ సినిమాను తెర కెక్కించాడు. మల్టిడైమన్షన్ వారు మా ప్రాజెక్ట్ కు ఎంతో బలాన్ని ఇచ్చారు''అన్నారు.

    నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని ఫిల్మ్ నగర్ సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.

    వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కె. శ్రీనివాసన్ నిర్మిస్తున్న "జెండాపైకపిరాజు'' చిత్రాన్ని మల్టిడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పిస్తున్నారు. శివబాలాజీ, తనికెళ్లభరణి, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రధారులు. .ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.

    English summary
    Nani and Amala Paul’s ‘Jenda Pai Kapiraju is getting ready for a release soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X