»   » అందుకేనా బాలకృష్ణ మరోసారి జయప్రద?

అందుకేనా బాలకృష్ణ మరోసారి జయప్రద?

Posted By:
Subscribe to Filmibeat Telugu

జయప్రధ గతంలో అడవి రాముడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ఎన్టీఆర్ సరసన నటించింది. ఆ తర్వాత బాలకృష్ణ తో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన మహారథి చిత్రంలో నటించింది. మళ్లీ బాలకృష్ణ, దాసరి నారాయణ రావు కాంబినేషన్లో రూపొందనున్న పరమ వీర చక్ర చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనుందని విశ్వసనీయ సమాచారం. సినిమాలపై ఆసక్తి చూపని ఆమెను ఆ పాత్ర కథకు కీలకమని చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. దాసరి ప్రత్యేకంగా మాట్లాడి ఈ ఆమె క్యారెక్టర్ చెప్పారని, ఆమె ఇంప్రెసైందని అంటున్నారు. అందులోనూ ఆంధ్రా రాజకీయాల్లో యాక్టివ్ పాల్గొనటానికి ఇది లాంచింగ్ గా ఉపయోగపడుతుందని, దానికి బాలకృష్ణ చిత్రం అనువైనదని భావించే ఆమె కమిట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.

ఇక మరోప్రక్క సైనికులకు భారత ప్రభుత్వం ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'పరమవీరచక్ర" పురస్కారాన్ని టైటిల్ గా పెట్టి సినిమా తీస్తున్నప్పుడు, అందులో ఎలాంటి అసభ్యకర సన్నివేశాలుండకూడదనే డిమాండ్ తెరపైకొచ్చింది. వ్యాపారాత్మక ధోరణి లో 'పరమవీరచక్ర" పేరును వాడుకోవడం సరికాదంటూ కోర్టుకెక్కేందుకు సిధ్దమవుతున్నాయి కొన్ని ప్రజా సంఘాలు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu