twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీలో జయసుధకు కీలక పదవి.. వైఎస్ జగన్ డిసైడ్ అయ్యాడట!

    |

    సహజ నటి జయసుధ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో బ్రహ్మండంగా రాణిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా చలన చిత్ర సీమలో రాణించిన సీనియర్ నటి రాజకీయాల్లోకి ప్రవేశించి తనదనై ముద్రను చూపించారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధ మళ్లీ పాలిటిక్స్‌పరంగా యాక్టివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది. తాజాగా ఏపీలో ఏర్పడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆమె సేవలను ఉపయోగించుకొనేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఆ క్రమంలోనే ఓ కీలక పదవిని కట్టబెట్టేందుకు చర్యలు చేపట్టినట్టు సమాచారం. జయసుధకు లభించబోయే పదవి ఏమిటంటే..

    రాజకీయాల్లోకి అడుగుపెట్టి

    రాజకీయాల్లోకి అడుగుపెట్టి

    సినిమాలో నటిస్తూనే 2004 నుంచి సమైక్యాంధ్రలో సికింద్రాబాద్ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న పరిస్థితులు, అలాగే వ్యక్తిగత జీవితంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాకపోతే సినిమాలో బాధ్యతాయుతమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులు ఆకట్టుకొంటున్నారు.

    పలువురు సినీనటులు మద్దతుతో

    పలువురు సినీనటులు మద్దతుతో

    ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి సినీ నటులు బహిరంగంగా మద్దతు తెలిపారు. మోహన్ బాబు, జయసుధ, ఆలీ, రాజశేఖర్ దంపతులు, పృథ్వీ, పోసాని కృష్ణమురళి, చిన్నికృష్ణ లాంటి సినీ ప్రముఖులు వైఎస్ జగన్ పక్షాన నిలిచారు. ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడంతో వారి సేవలకు గుర్తింపుగా కీలక పదవులను అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా జయసుధ

    ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా జయసుధ

    ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ (ఏపీఎఫ్‌డీసీ) పదవికి అంబికా కృష్ణ రాజీనామా చేశారు. దాంతో ఆ పదవికి ఎవరైతే సరియైన అభ్యర్థి అవుతారనే విషయం చర్చకు వచ్చినప్పుడు జయసుధ పేరు తెరపైకి వచ్చిందట. వైఎస్ కుటుంబానికి నైతికంగా మద్దతు ఇస్తున్న జయసుధకు ఆ పదవిని ఇవ్వాలని ఏపీ సీఎం డిసైడ్ అయినట్టు ఓ వార్త జోరందుకున్నది.

     వైఎస్ జగన్ నిర్ణయంతో

    వైఎస్ జగన్ నిర్ణయంతో

    దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయసుధకు మంచి స్థానం కల్పించేందుకు వైఎస్ జగన్ నిర్ణయించుకొన్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా ఆమెను నియమించబోతున్నారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ పదవికి మోహన్ బాబు, ఆలీ, జీవిత కూడా పోటి పడుతున్నట్టు సమాచారం.

    English summary
    Actor and Politician Jaya Sudha again in news. After YSR Congres government formation, her name is considering for the post of Andhra Pradesh Film Development Corporation chairman. Follower of YSR, She has been top race for the crucial post of Film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X