వరుడు చిత్రంపై జె.సి బ్రదర్స్ మండిపాటు?
అల్లుఅర్జున్, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన వరుడు చిత్రంలో విలన్ ఆర్య పేరు దివాకర్, అతని అన్న ఆహుతి ప్రసాద్ పేరు ప్రభాకర్. అలాగే వీరికి బస్సులు వ్యాపారం ఉంటుంది. వీరిని కె.కె. బ్రదర్శ్ అని వ్యవహరిస్తూంటారు. ఈ సెటప్ చూసిన ఎవరికైనా జె.సి. బ్రదర్శ్ గుర్తుకు రావటం ఖాయం. కావాలనే ఈ పాత్రలను పెట్టారో లేక యాదృఛ్చికంగా జరిగిందో కానీ ఈ పాత్రలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎస్.ఎమ్.ఎస్ ల ద్వారా కూడా ఈ మ్యాటర్ సినిమా చూడనివారికి కూడా స్ప్రెడ్ అయినట్లు తెలుస్తోంది. దాంతో జె.సి బ్రదర్స్ అయిన జె.సి. దివాకర్ రెడ్డి, జె.సి ప్రభాకర్ రెడ్డి మండిపడుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అలాగే దర్శకుడు గుణశేఖర్ ని ఈ విషయంపై ఎక్సప్లనేషన్ కూడా అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అసలే సినిమా పోయి నెగిటివ్ టాక్ వచ్చి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయని బాధలో ఉన్న యూనిట్ కు ఇది మరో తలనొప్పే.


Click it and Unblock the Notifications











