twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజమైతే...నిఖిల్ ఆశలపై నీళ్లు పోసినట్లే

    By Srikanya
    |

    హైదరాబాద్ : నిఖిల్, కలర్స్ స్వాతి కాంబినేషన్ లో రూపొందిన ‘కార్తికేయ' చిత్రం మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ,తెలుగు వెర్షన్స్ రెడీ చేస్తున్నామని చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రం తమిళంలోకి రీమేక్ చేయటానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం. రంగం ఫేమ్ జీవా హీరోగా తమిళంలో ఈ చిత్రం రూపొందనుంది. జీవా తండ్రి ఆర్.బి.చౌదరి ఈ చిత్రం రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

    కార్తికేయుడు(సుబ్రమణ్యేశ్వరస్వామి)...తమిళలకు ఇష్టమైన దేముడు కాబట్టి తమ నేటివిటీకి సరిపోతుందని భావించారని చెప్తున్నారు. కలర్స్ స్వాతిని తమిళ వెర్షన్ కు సైతం తీసుకుంటున్నారు. అక్కడ ఆమెకు మార్కెట్ ఉండటంతో కలిసి వస్తుందని భావిస్తున్నారు.ఈ నేపధ్యంలో ఈ చిత్రం ద్వారా తమిళంకు వెళ్దామనుకున్న నిఖిల్ ఆశలపై నీళ్లు పోసినట్లే అంటుతన్నారు. మరి నిఖిల్ ఏమంటాడో చూడాలి. ఇక తమిళనాట బిజినెస్ చేసి రిలీజ్ చేయటం కన్నా రీమేక్ రైట్స్ ద్వారా ఎక్కువ వస్తాయని ట్రేడ్ లో అంటన్నారు. అందుకే నిర్మాతలు ఆ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.

    ''హ్యాపీడేస్‌', 'స్వామి రా రా' తరవాత నాకు లభించిన పెద్ద విజయమిది. నా కెరీర్‌కి బూస్ట్‌లా పనిచేస్తుంద''న్నారు నిఖిల్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'కార్తికేయ'. స్వాతి కథానాయిక. చందు మొండేటి దర్శకుడు. ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విజయోత్సవం జరుపుకొంది.

    Jeeva to remake Karthikeya Movie

    నిఖిల్‌ మాట్లాడుతూ ''దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం బాగా నచ్చింది. సంగీతం, కెమెరా పనితనం ఉన్నత స్థాయిలో ఉన్నాయి. విజయంలో తొలి భాగం రావు రమేష్‌గారికే. ప్రచార చిత్రాల్లో ఆయన పలికిన సంభాషణలు హిప్నటైజ్‌ చేశాయి. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాయ''న్నారు.

    ''ఇది కార్తీకమాసం. అయితే 'కార్తికేయ' రాకతో కార్తికేయ మాసం అయిపోయింది'' అని తనికెళ్ల భరణి చమత్కరించారు. రావు రమేష్‌ చెబుతూ ''ఈ సినిమాను నిఖిల్‌ తన భుజాలపై వేసుకొని నడిపించాడు. వినోదం, టెన్షన్‌ కలగలిపిన ఈ చిత్రం మా అందరికీ మంచి పేరు తీసుకొచ్చింద''న్నారు. ''అందరి సహకారంతోనే ఇంత మంచి సినిమా తీయగలిగా'' అన్నారు దర్శకుడు.

    ''సినిమా విడుదలకు ముందు పడిన టెన్షన్‌ అంతా ఫలితం చూశాక మాయమైంద''ని నిర్మాత శ్రీనివాస్‌ బొగ్గారం చెప్పారు. సంగీత దర్శకుడు శేఖర్‌ చంద్ర మాట్లాడుతూ ''కార్తికేయ నేపథ్య సంగీతం విషయంలో ప్రత్యేక దృష్టిపెట్టి పనిచేశా. సినిమా చూసినవాళ్లంతా నేపథ్య సంగీతం బాగుందని మెచ్చుకోవడం ఆనందాన్నిచ్చింద''న్నారు.

    English summary
    Jiva is showing interest in starring in Nikhil,Swathi's ‘Karthikeya’ re-make. His father RB.Chowdhary, popular producer is in talks with the producer of ‘Karthikeya’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X