»   »  సినీ రాజకీయాలపై పుస్తకం రాయనున్న జీవిత రాజశేఖర్

సినీ రాజకీయాలపై పుస్తకం రాయనున్న జీవిత రాజశేఖర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్వరలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా చేసిన జీవిత రాజశేఖర్ త్వరలో రచయిత అవతారం ఎత్తనుంది. సినీ రాజకీయాలపై ఆమె ఓ పుస్తకం రాయబోతోందని సినీ వర్గాల్లో వినపడుతోంది. రామ్ గోపాల్ వర్మ..నా ఇష్టం పేరుతో విడుదల చేసిన పుస్తకం చూసిన ఆమెకు ఈ ఐడియా వచ్చి రాస్తే ఎలాగుంటుంది అని తన శ్రేయాభిలాషులతోనూ, సన్నిహితులతోనూ చర్చిస్తోందని వినికిడి. అలాగే ఈ పుస్తకం ద్వారా మరోసారి వార్తల్లోకి ఎక్కే అవకాసం ఉంటుందని ఆమె భావిస్తోంది. ఇక ఈ పుస్తకంలో ఆమె ఎవరిని టార్గెట్ చేయనుందో తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుకు ఇంకా రాజశేఖర్ ఆమోద ముద్ర లభించలేదట. కాబట్టి కొంత కాలం ఆగి ఈ పుస్తకం ప్రారంభించవచ్చు. ఇక ప్రస్తుతం రాజశేఖర్..మహంకాళి అనే చిత్రంలో నటిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu