»   » ఇవన్నీచూస్తూంటే నానికి టెన్షన్ కాక మరేంటి?

ఇవన్నీచూస్తూంటే నానికి టెన్షన్ కాక మరేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నాని, అమలాపాల్‌ జంటగా తమిళ దర్శకుడు సముద్రఖని రూపొందించిన చిత్రం 'జెండాపైకపిరాజు'. రాగిణి ద్వివేది కీలకపాత్ర పోషించింది. కె.ఎస్‌.శ్రీనివాసన్‌, శివరామన్‌, రజిత్‌ పార్థసారధి నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఆగస్టు 8 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వరస పరాజయాలతో ఉన్న నాని ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

అయితే ఈ చిత్రం తమిళ వెర్షన్ వర్కవుట్ కాకపోవటంతో తెలుగులో రిలీజ్ అవుతోందంటే నానికి టెన్షన్ స్టార్ట్ అయినట్లే అంటున్నారు. మరోప్రక్క ఈచిత్రానికి క్రేజ్ తెచ్చిపెడుతుందనుకున్న హీరోయిన్ అమాలాపాల్ పెళ్లి చేసేసుకోవటంతో ఆమెను ఇంకా గ్లామర్ క్వీన్ గా తెరపై చూడ్డటానికి ఇష్టపడతారా అన్నది మరో ఆలోచన. బిజినెస్ కూడా ఈ చిత్రానికి కాలేదని, సొంతంగా రిలీజ్ చేస్తున్నారని ట్రేడ్ వర్గాలలో వినపడుతోంది.

Jenda Pai Kapiraju’s release date confirmed

నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'జెండాపై కపిరాజు'. తొలిసారిగా నాని ద్వి పాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఇందులో తండ్రిగానూ,కొడుకు గానూ నాని కనిపసిస్తాడని తెలుస్తోంది. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అని సమాచారం. బట్టతలతో ,45 సంవత్సరాల పెద్దాయనగా కనిపిస్తాడు.

దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ...ఈ దేశానికి ఏం చేయొద్దు. సొంత వూరుని బాగు చేయొద్దు. పనులన్నీ మానేసి పక్కవాడికి సేవ చేయొద్దు. నీకు నువ్వు బాగుపడు... చాలు. ఈ దేశం దానికదే బాగుపడుతుంది. మా కథలో ఇదే చెబుతున్నాం అంటున్నారు సముద్రఖని.

నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రతి వ్యక్తి తననితాను సంస్కరించుకొంటే దేశాన్ని సంస్కరించినట్టే. ఈ అంశం చుట్టూ నడిచే చిత్రమిది. నాని ద్విపాత్రాభినం చేశారు. రెండు పాత్రల్లోనూ ఆయన నటన ఆకట్టుకొంటుంది. శరత్‌కుమార్‌ ఓ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. జీవి ప్రకాష్‌ అందించిన సంగీతం అదనపు ఆకర్షణ. నాని మొట్ట మొదటి సారిగా పూర్తి స్థాయిగా మాస్ పాత్ర పోషిస్తున్నాడు. శంభో శివ శంభో'' చిత్రం తో దర్శకుడిగా తన టాలెంట్ చూపించిన సముద్రఖని ఈ సినిమాను తెర కెక్కించాడు. మల్టిడైమన్షన్ వారు మా ప్రాజెక్ట్ కు ఎంతో బలాన్ని ఇచ్చారు''అన్నారు.

వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై కె. శ్రీనివాసన్ నిర్మిస్తున్న "జెండాపైకపిరాజు'' చిత్రాన్ని మల్టిడైమన్షన్ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సమర్పిస్తున్నారు. శివబాలాజీ, తనికెళ్లభరణి, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌ ప్రధాన పాత్రధారులు. .ఆహుతి ప్రసాద్‌, శివబాలాజీ, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఛాయాగ్రహణం: సుకుమార్‌, కూర్పు: ఫాజల్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్‌.


English summary
Nani’s upcoming film Jenda Pai Kapiraju, has been delayed for a much longer time now. According to the latest update, the film is all set to be released on the 8th of August.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu