»   » శ్రీదేవి కూతురుతో షారుక్ కొడుకు రొమాన్స్?(ఫోటో ఫీచర్)

శ్రీదేవి కూతురుతో షారుక్ కొడుకు రొమాన్స్?(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వారసుల జోరు కొనసాగుతోంది. ఒకరకంగా చెప్పాలంటే బి-టౌన్లో కొత్తగా వస్తున్న వారంతా నటులు, నిర్మాతలు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు, రచయితల వారసులే. ఈ తరహాలో ఇప్పటికే పలువురు స్టార్ల వారసులు బాలీవుడ్ తెరంగ్రేటం చేసారు.

బాలీవుడ్ నటి శ్రీదేవి కూతు ఝాన్వి కపూర్ త్వరలో తెరంగ్రేటం చేయబోతోందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలసిందే. మరో వైపు షారుక్ తనయుడు ఆర్యన్ కూడా త్వరలో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం....ఝాన్వి కపూర్, ఆర్య కలిసి 'ఆషిఖి-3' చిత్రంలో నటించబోతున్నారనే వార్తలు బాలీవుడ్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

ఇప్పటికే వచ్చిన ఆషిఖి, ఆషిఖి 2 చిత్రాలు భారీ విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో 'ఆషిఖి-3' చిత్రం ఝాన్వి కపూర్, ఆర్యన్‌లతో తీస్తే మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు.

ఆర్యన్ ఖాన్

ఆర్యన్ ఖాన్

ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం తన హైయ్యర్ స్టడీస్ నిమిత్తం లండన్లో ఉంటున్నాడు. లండన్లోని ప్రఖ్యాత సెవెనోక్స్ స్కూల్‌లో చదువతున్నాడు. షారుక్-గౌరీ కావాలనే ఆర్యన్‌ను మీడియాకు దూరంగా ఉంచుతున్నారని, అందుకే చదువుల నిమిత్తం లండన్ పంపారని బాలీవుడ్ టాక్.

ఫ్యూచర్ హీరో

ఫ్యూచర్ హీరో

షారుక్ నటించిన ‘కభి ఖుషి కభి గమ్' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసిన ఆర్యన్ ఖాన్ భవిష్యత్‌లో హీరోగా పరిచయం కాబోతున్నాడు.

ఝాన్వి కపూర్

ఝాన్వి కపూర్

జాన్వి కపూర్ హీరోయిన్ కావాలనే లక్ష్యంతో ఉన్న జాన్వి కపూర్ ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా ప్రత్యేక మైన వస్త్రధారణలో హాట్ అండ్ సెక్సీ లుక్‌లో దర్శనమిస్తోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకునే ప్రచత్నం చేస్తోంది.

ఫ్యామిలీ సపోర్ట్

ఫ్యామిలీ సపోర్ట్

సినిమా వాతావరణంలో పెరిగిన పిల్లలు ఆరంగం వైపు ఆకర్షితులవ్వడం మామూలే. హీరోయిన్ కావాలనే జాన్వి కోరికకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా సపోర్టుగా ఉంటున్నారట.

ఝాన్వి కపూర్

ఝాన్వి కపూర్

ప్రస్తుతం ఝాన్వి చదువుతోపాటు నృత్యం కూడా నేర్చుకొంటోంది. డైలాగ్స్ ఎలా పలకాలో కూడా తెలుసుకుంటోంది. జిమ్‌లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది. ఇవన్నీ చూస్తోంటే ఆమె వెండి తెర ప్రవేశానికి మరెన్నో రోజులు లేవని సన్నిహితులు చెబుతున్నారు.

English summary
Jhanvi who aims to become an actress is likely to be paired for Ashiqui -3 along with SRK’s Son Aryan.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu