»   » చిరంజీవి,రామ్ చరణ్ కలిసి తమిళ రీమేక్ లో ?

చిరంజీవి,రామ్ చరణ్ కలిసి తమిళ రీమేక్ లో ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Jilla remakes in Telugu with Chiranjeevi and son Ram Charan
హైదరాబాద్ : చిరంజీవి 150 వ చిత్రంలో ఆయన కుమారుడుతో కలిసి నటించనున్నారా...అవుననే వినపడుతోంది. తెలుగు సినీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి తన 150వ చిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. తమిళంలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న చిత్రాన్ని కొద్ది పాటి మార్పులతో తెలుగులో అందించనున్నారు. దానికి వివి వినాయక్ దర్శకత్వం వహించనున్నారు.

ఇంతకీ ఆ తమిళ సినిమా మరేదో కాదు...మొన్న సంక్రాంతికి విడుదలైన జిల్లా. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, విజయ్ హీరోలుగా చేసారు. మోహన్ లాల్ పోషించిన పాత్రను చిరంజీవి చెయ్యాలని భావిస్తున్నారు. విజయ్ చేసిన పాత్రను రామ్ చరణ్ తో చేయించాలని అనుకుంటున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ ఆ చిత్రాన్ని చూసినట్లు సమాచారం. జిల్లా చిత్రాన్ని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేయకపోవటానికి కారణం రీమేక్ చేయాలనే ఆలోచనే అంటున్నారు.

జిల్లాలో శివన్ అనే పాత్రను మోహన్ లాల్ పోషించారు. కథ ప్రకారం శివన్ ...మధురై ఏరియాలో ఓ డాన్. తన డ్రైవర్ ఓ పోలీస్ అధికారి చేతిలో చనిపోవటంతో అతను కుమారుడు శక్తి(విజయ్)ని పెంచుతాడు. శక్తి చిన్నప్పటి నుంచి పోలీసులను ద్వేషిస్తూ ఎదుగుతాడు. అయితే పెంచిన తండ్రి క్రైమ్ సిండికేట్ ని కాపాడటానికి శక్తి పోలీస్ గా జాయిన్ అవుతాడు. అక్కడ నుంచి కథ టర్న్ తీసుకుంటుంది. ఓ సంఘటనకు చలించిన శక్తి... పోలీసులకు సపోర్టర్ గా మారతాడు. అంతేగాక తన పెంచిన తండ్రిని మారటానికి ప్రయత్నాలు చేస్తూంటాడు...ఆ క్రమంలో ఏం జరిగిందనేది మిగతా కథ .

ఇక మోహన్ లాల్, విజయ్ పాత్రలు రెండూ పక్కా మాస్ పాత్రలు కావటంతో తమకి కరెక్టుగా సూట్ అవుతుందని తండ్రి కొడుకులు భావిస్తున్నారుట. వినాయక్ లాంటి మాస్ డైరక్టర్ టేకప్ చేస్తే ఈ యావరేజ్ కథని సూపర్ హిట్ చెయ్యగలడు అంటున్నారు. చిరంజీవి సైతం ఈ సబ్జెక్టు విని చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే రాజకీయాల్లో బిజీగా ఉన్న చిరంజీవి...ఎంత వరకూ ఈ సబ్జెక్టు చేస్తాడనేది వేచి చూడాల్సిన అంశం.

English summary

 Rumors have been in circulation that Ram Charan and Chiranjeevi might star in the remake of this movie as Vijay and Mohanlal played Son and Father in this commercial flick. Jilla is released on January 10th and Mega family might consider remaking it if the Tamil movie hits the bull's eye.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu