»   » రాఘవేంద్రరావుకి షాక్ ఇవ్వటానికేనా?

రాఘవేంద్రరావుకి షాక్ ఇవ్వటానికేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కన్నా గొప్పగా తీసాడని,భక్తి సినిమా అంటే ఇలా ఉండాలని చెప్పుకోవాలనే కసితో రైటర్ నుంచి దర్శకుడుగా మారిన జెకె భారవి పనిచేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.తను తీస్తున్న ఆది శంకర అవుట్ పుట్ చూసి ఆయన షాక్ అవ్వాలనే ఈ రైటర్ గారి లక్ష్యం అంటున్నారు.అన్నమయ్య నుంచి పాండురంగడు దాకా పనిచేసిన రాఘవేంద్రరావు,భారవి ఆ తర్వాత విభేదాలు వచ్చి విడిపోయారు.

అప్పుడు జెకె భారవి తానే దర్శకుడుగా మారి తన స్క్రిప్టులను తెరకెక్కించుకోవాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగారు.మరో ప్రక్క రాఘవేంద్రరావు ప్రముఖ రచయితలు పరుచూరి బ్రదర్స్ ని తీసుకుని నాగార్జునతో షిర్డీ సాయి ప్రాజెక్టుని రూపకల్పన చేస్తున్నారు.దీంతో తన సినిమాకు సైతం స్టార్ స్టేటస్ రావాలని భారవి ఆలోచింది నాగార్జునని,కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రని ఒప్పించాడు.దాంతో ఇప్పుడు ఈ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

అలాగే జెకె భారవి ఈ చిత్రం కోసం మరో ఇద్దరు హీరోయిన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నామని, పూర్తి వివరాలు త్వరలో చెబుతామని భారవి చెప్పారు.ఇందులో హీరో కౌషిక్, రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్ శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.

English summary
Looking at the way ‘Aadi Shankara’ is shaping up, it might give a shock to even K Raghavendra Rao. With this film, the real director in J K Bharavi will be revealed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu