»   » ఆమె కోసం అటు రామ్ చరణ్ , ఇటు ఎన్టీఆర్ , రవితేజ

ఆమె కోసం అటు రామ్ చరణ్ , ఇటు ఎన్టీఆర్ , రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఒక హీరోయిన్ బాగుందంటే ఆ డిమాండే వేరు. ఇప్పుడు అలాంటి పరిస్ధితే ఏర్పడిందంటున్నాయి తెలుగు సినిమా వర్గాలు. ఒకే హీరోయిన్ ని అటు రామ చరణ్ కొత్త చిత్రం (తని ఒరువన్ రీమేక్ కోసం), ఎన్టీఆర్,కొరటాల శివ చిత్రం కోసం అనుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు చిత్రాలు ఒకే సమయంలో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాసం ఉంది. దాంతో ఆమె ని ఇద్దరూ సంప్రదించారని, ఎటు ఫైనలైజ్ చేస్తుందో చూడాలని అంటున్నారు.

ధనుష్ తో ఆ మధ్యన వచ్చిన అనేకుడు చిత్రంలో హీరోయిన్ గా చేసిందామె. సినిమా విజయం సాధించకపోవటంతో బిజీ కాలేకపోయింది. అయితే అందిరి దృష్ఠిలో ఆమె పడింది. ఇప్పుడు ఆమె ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలలోనే కాక..నాగచైచతన్య హీరోగా రూపొందుతున్న ప్రేమమ్ రీమేక్ మజ్ను లోనూ, రవితేజ హీరోగా రూపొందుతున్న ఎవడో ఒకడు చిత్రంలోనూ హీరోయిన్ గా పరిశీలనలో ఉందని తెలుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

jr Ntr and Ram Charan may romance with Amyra

ఇక ఎన్టీఆర్ కొత్త చిత్రం విషయానికి వస్తే...

'నాన్నకు ప్రేమతో' షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ఈలోగా మరో సినిమానీ పట్టాలెక్కించేశారు. ఎన్టీఆర్‌ హీరోగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. కొరటాల శివ దర్శకుడు. నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ నిర్మాతలు. హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవరు చేస్తారన్నదానిపై ఓ విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టడం మొదలైంది. ఆమె రీసెంట్ గా వచ్చి హైదరాబాద్ వచ్చి మరీ ఫొటో షూట్ లో పాల్గొందని చెప్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అంటే ... అమైరా దస్తూర్.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ''బృందావనం' దగ్గర్నుంచీ కొరటాల శివతో అనుబంధం ఉంది. అభిరుచి గల దర్శకుడాయన. మంచి రచయిత కూడా. మాస్‌ మెచ్చేలా, క్లాస్‌కి నచ్చేలా సినిమాలు తీస్తుంటారు. ఈ సినిమా కూడా అందరి మన్ననలూ పొందుతుందన్న నమ్మకం ఉంది''అన్నారు.

jr Ntr and Ram Charan may romance with Amyra

''ఎన్టీఆర్‌ శైలికి సరిపడే కథ ఇది. అభిమానులు ఆయన్ని ఎలా చూడాలనుకొంటున్నారో ఆ పాత్రని అలా తీర్చిదిద్దాను. ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఓ కీలకమైన పాత్రని ప్రముఖ నటుడు పోషిస్తారు. ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తాము''అన్నారు దర్శకుడు.

''జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఆగస్టు 12న విడుదల చేస్తాము''అన్నారు నిర్మాతలు. ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌రామ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. చిత్రానికి ఛాయాగ్రహణం: మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.ఎస్‌.ప్రకాష్‌.

English summary
NTR is all set to star under the direction of Koratala Siva. Inside talk is Amyra Dastur of Dhanush’s ‘Anekudu’ fame will be starring in this next film.
Please Wait while comments are loading...