twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆచార్యను చూసిన ఎన్టీఆర్.. కొరటాల శివ విషయంలో తీసుకున్న మరో నిర్ణయం ఇదే!

    |

    ఇటీవల విడుదలైన ఆచార్య సినిమా ఊహించని స్థాయిలో అపజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. సినిమా పై పెట్టిన పెట్టుబడికి ఊహించని విధంగా గతంలో ఎప్పుడూ లేనివిధంగా నష్టాలు వచ్చాయి. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్ లోనే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా చెప్పుకుంటున్నారు. ఆచార్య సినిమా దాదాపు 80 కోట్ల వరకు నష్టాలను కలిగించినట్లు సమాచారం. అయితే సినిమా డిజాస్టర్ కావడం వలన ఓటీటీ లో కాస్త ముందుగానే వస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత నే విడుదల చేయాలి. కానీ సినిమా అనుకున్న ఫలితం ఇవ్వని కారణంగా అమెజాన్ ప్రైమ్ వాళ్లు ఒప్పుకున్న డీల్ లో కాస్త మార్పులు చేయడంతో ముందుగానే విడుదల చేస్తున్నారు. ఈ డీల్ వలన దాదాపు 16 కోట్ల వరకు లాభం వస్తుండటం వలన నిర్మాతలు పెద్దగా ఆలోచించకుండా ఓటీటీ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    ఈ నెల 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ఆచార్య సినిమా స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా డిజాస్టర్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా కొంత అప్సెట్ అయ్యాడు. ఎందుకంటే ఆచార్య దర్శకుడు కొరటాల శివ తన తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకొని తన మార్కెట్ను మరింత పెంచుకోవాలి అని అనుకుంటున్నాడు.

    Jr ntr another key decision on koratala siva pan india project

    కానీ ఈ తరుణంలో దర్శకుడు అతి పెద్ద డిజాస్టర్ ను అందుకోవడం ఒక విధంగా అతని తదుపరి సినిమా మార్కెట్ పై కూడా ప్రభావం చూపుతుంది అని భయం కూడా ఉంటుంది. కాబట్టి ఎన్టీఆర్ అయితే చాలా సార్లు చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక రీసెంట్ గా కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఆచార్య సినిమాను చూసినట్లు సమాచారం. ఇక ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని కొరటాల శివ తో చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

    అయితే మొన్నటి వరకు ఎన్టీఆర్ ఈ సినిమా కథ విషయంలో నమ్మకంగా ఉన్నప్పటికీ ప్రాజెక్టును స్టార్ట్ చేసే ఆలోచనలో లేడు అని కూడా కథనాలు వెలువడ్డాయి. కానీ అదంతా కూడా అబద్ధం అని తెలుస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ కు కొరటాల శివ చెప్పిన కథపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఆ ప్రాజెక్టు అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఉంటుంది అని కాకపోతే స్క్రిప్ట్ డిజైనింగ్ విషయంలో మాత్రం కొంత చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా ఎప్పటిలానే కొరటాల శివపై నమ్మకంతో ఉన్నాడు అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్లాన్ ప్రకారమే జూలై లోనే సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాకోసం జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త మెకోవర్ తో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఇప్పటినుంచే ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాపై అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం.

    English summary
    Jr ntr another key decision on koratala siva pan india project
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X