»   » రీమేక్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు

రీమేక్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్ తన కెరీర్ లో రీమేక్ పట్ల ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. అయితే ఆయన తాజాగా తమిళంలో విడుదలై రికార్డు సృష్టించిన చిత్రం కత్తి ని రీమేక్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఆ చిత్ర దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా ఎన్టీఆర్ ను మురుగదాస్ ఎంపిక చేసినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. గోపీచంద్ మలినేని దర్శకుడుగా చేయనున్నారని తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాతగా ఉండే అవకాసం ఉంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దీనిపై సాధ్యమైనంత త్వరలో దర్శకుడు మురుగదాస్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని వారు తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం కత్తి. గతేడాది నవంబర్ లో విడుదలైన ఈ చిత్రం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

Jr NTR Finally Gives A Nod For Kaththi Remake, Gopichand Malineni Likely To Helm

కత్తిలో హీరో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరో సొంత ఊరిలోని వ్యవసాయ భూములను ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ భూములు కోసం హీరో వీరోచితంగా పోరాడే కథాంశంతో దర్శకుడు మురుగదాసు ఈ చిత్రాన్ని రసవత్తరంగా తెరకెక్కించారు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ లో యమబిజీగా ఉన్నారు.

మరో ప్రక్క ‘బలుపు', ‘పండగ చేస్కో' లాంటి సినిమాల దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. గోపీచంద్, దర్శకుడు మురుగదాస్ వద్ద గతంలో అసిస్టెంట్‌గా చేశారు. ఇక తెలుగు వర్షన్ కోసం స్వయంగా మురుగదాసే స్క్రీన్‌ప్లేలో మార్పులు చేయనున్నారని వినికిడి.

English summary
Jr NTR has finally given a green signal for the remake of Vijay's super hit film, Kaththi. Gopichand Malineni will be handling the direction.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu