»   » ఎన్టీఆర్ వివాహ ముహూర్తం ఆ రోజే ఫిక్స్!?

ఎన్టీఆర్ వివాహ ముహూర్తం ఆ రోజే ఫిక్స్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్, నార్నే లక్ష్మీ ప్రణతి వివాహం మే తొమ్మిదిన జరగనుందని విస్వశనీయ సమాచారం. ఈ మేరకు రెండు కుటుంబాల పెద్దలూ పురోహితులతో చర్చించి ఆ రోజున ముహూర్తం నిర్ణయించారు. ఇక వివాహ నిశ్చితార్ధం ఈ రోజు(01.04.10) తెల్లవారుఝామున బ్రహ్మీ ముహూర్తంలో హోటల్ నొవొటల్, హైదరాబాదులో కన్నుల పండుగ గా జరిగింది. ఈ నిశ్చితార్థ మహొత్సవానికి రెండు వైపుల నుండి బందువులు, స్నేహితులు వచ్చారు. నిశ్చితార్ధం కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీ నుండి దిల్ రాజు, వివి వినాయక్, రాజమౌళి, మెహర్ రమేష్ అశ్వినీ దత్ తదితరులు హాజరయ్యారు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ' బృందావనం"(గోవిందుడు అందరి వాడేలే) చిత్రం చేస్తున్నారు. ఇందులో జూ ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రంలోనూ చేస్తున్నారు. ఇందులో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu