»   » లక్ష్మీ పార్వతి ఎంట్రీతో చంద్రబాబుకు దూరమవుతున్న జూ ఎన్టీఆర్!?

లక్ష్మీ పార్వతి ఎంట్రీతో చంద్రబాబుకు దూరమవుతున్న జూ ఎన్టీఆర్!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివాహ నిశ్చితార్ధం ఏప్రిల్ 1న జరగనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మేనకోడలు మల్లిక, నార్నె శ్రీనివాసరావుల కుమార్తె లక్ష్మీ ప్రణితితో ఎన్టీఆర్ వివాహ నిశ్చితార్ధం జరగనుంది. జూబ్లీ హిల్స్ లోని నార్నె శ్రీనివాసరావు నివాసంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. నిశ్చితార్ధం కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

ఎన్టీఆర్ కు పెళ్ళి సంబంధం కుదిర్చింది చంద్రబాబు నాయుడు అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నార్నే ఫ్యామిలీతో ఎన్టీఆర్ చాలా క్లోజ్ గా ఉంటున్నాడట. తనకు కాబోయే భార్య లక్ష్మీప్రణతితో ఎన్టీఆర్ ఔటింగ్ కు వెళుతున్నాడట. ఎక్కువ సమయం నార్నే కుటుంబ సభ్యులతోనూ, లక్ష్మీతోనూ ఎన్టీఆర్ గడుపుతున్నాడని సమాచారం.

ఒక వైపు నార్నే ఫ్యామిలీతో క్లోజ్ అవుతున్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడుకు మాత్రం దూరమవుతున్నాడట. దీనికి కారణం ఏంటో తెలియడం లేదు కానీ..లక్ష్మీ పార్వతి, బాలకృష్ణ మీటింగ్ నే కారణమని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరి అసలు సంగతి ఏంటో ఎన్టీఆర్ నోరువిప్పితే గానీ తెలియదు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'బృందావనం', అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శక్తి' చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu